Advertisement
Google Ads BL

‘వకీల్ సాబ్‌’కు పోటీగా ‘డైరెక్టర్ సాబ్’!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇన్నిరోజులుగా పవన్ లుక్ కోసం వేచి చూసిన మెగాభిమానులు, జనసేన కార్యకర్తలకు శుభవార్త చెబుతూ ఇవాళ.. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను వదిలాడు. సినిమా టైటిల్ ‘వకీల్ సాబ్’ కాగా.. ఈ లుక్‌లో పవన్ పడుకొని బుక్ చదువుతున్నట్లు ఉంది. మరీ ముఖ్యంగా లుక్ రిలీజ్ చేసినప్పుడు రాజుగారి ఆఫీస్ దగ్గర హడావుడి ఓ రేంజ్‌లో ఉంది. అయితే ప్రస్తుతం ఈ లుక్‌.. ఇందుకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ లుక్, టైటిల్‌పై పలువురు ప్రముఖులు కూడా స్పందించారు.

Advertisement
CJ Advs

తాజాగా.. ఈ లుక్‌పై వివాదాలకు కేరాఫ్ దర్శకుడిగా పేరుగాంచిన.. మెగా ఫ్యామిలీని అస్తమానూ గోకే.. రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యాడు. తనదైన శైలిలో హడావుడి చేస్తూ మెగాభిమానుల చేత తిట్టించుకుంటున్నాడు. సేమ్ టూ సేమ్ పవన్ లాగా.. ఆర్జీవీ కూడా కూర్చొని ఉన్న ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు.. పవన్ ‘వకీల్ సాబ్’ అయితే నేను ‘డైరెక్టర్ సాబ్’ అంటూ ఓ పోస్టర్ కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

అంతటితో ఆగిన ఆయన.. ‘నేను కొంతమంది ఇడియట్స్ గురించి ఆలోచించను.. ఇలాంటి ఇడియట్ పనులను చేయను’ అని రాసి ఆ ఫోటోకు ట్యాగ్ చేశాడు. అయితే.. ఆర్జీవీ ఇలా సెటైరికల్‌గా ట్వీట్ చేయడంపై మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొందరైతే సహనం కోల్పోయి బూతుల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరైతే మీమ్స్ పెడుతూ ఇష్టానుసారం తిట్టిపోస్తున్నారు. ఇంకొదరైతే ఈ లుక్‌ను.. ఆర్జీవీని ఎడిట్ చేసిన ఫొటోలను పోస్ట్ చేసి నేత్రానందం పొందుతున్నారు. ఏదైతేనేం అలా పవన్ లుక్‌తో అదరగొట్టగా.. ఆర్జీవీ ఇలా హాట్ టాపిక్ అయ్యాడు.

RGV Comments On Pawan Vakeel Sab Look!:

RGV Comments On Pawan Vakeel Sab Look!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs