Advertisement
Google Ads BL

వకీల్ సాబ్ గా పవన్ కళ్యాణ్...


తెలుగు సినీ ప్రేక్షకులే కాదు సాధారణంగా అప్పుడో ఇప్పుడో సినిమాలు చూసేవారు కూడా ఎంతో ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ఆ హీరోని మళ్ళీ తెర మీద చూస్తామా లేదా అన్న సందేహం నుండి మళ్ళీ చూస్తామని తెలిసినప్పటి నుండి ఎవరో కొత్త హీరో లాంఛ్ అవుతున్నాడన్నంత ఆసక్తితో ఎదురు చూస్తున్న అభిమానులకి పండగ లాంటి రోజు రానే వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ నిరీక్షణకి ఈ రోజు ఫలితం దక్కింది.

Advertisement
CJ Advs

 

ఈ పాటికే మీకు విషయం అర్థమై ఉంటుంది. అవును నేను మాట్లాడుతున్నది పవన్ కళ్యాణ్ సినిమా గురించే. పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసినప్పటి నుండి ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఆయన అభిమానులకైతే ఆ వార్తే ఒక పండగలా అనిపించింది. బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. 

 

దిల్ రాజు నిర్మాతగా ఎమ్ సీ ఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజకీయాల్లో అనుక్షణం బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ముఫ్పై రోజుల సమయాన్ని కేటాయించాడట. అయితే నేడు ఈ చిత్ర టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర బృందం. ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ని రివీల్ చేశారు. అందరూ అనుకున్నట్టుగానే "వకీల్ సాబ్ " అనే పేరును కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ట్రెండింగ్ లో ఉంది.

Pawan Kalyan as Wakeel saab:

Pawan Kalyan first look released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs