Advertisement
Google Ads BL

బాలయ్య సినిమాలో విలన్ ఆయన కాదా?


బోయపాటి సినిమాల్లో విలన్స్ కి హీరో కూ సమానమైన పవర్ ఫుల్ పాత్రలు పడుతుంటాయి. అందులోను బాలకృష్ణ లెజెండ్ సినిమాలో హీరో జగపతి బాబుని తీసుకొచ్చి విలన్ ని చేసిన బోయపాటి.. జగపతి బాబుకి ఆ పాత్ర ఇచ్చి అతని కెరీర్ కి మంచి బాట వేసాడు. ఇప్పుడు జగపతి భారీ విలన్ గా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసుకుంటున్నాడు. అలాగే హీరో శ్రీకాంత్ ని ప్రస్తుతం బాలయ్య సినిమా కోసం బోయపాటి విలన్ పాత్ర కోసం సంప్రదించాడనే న్యూస్ నడిచింది. బాలయ్య - బోయపాటి సినిమాలో శ్రీకాంత్ విలన్ గా ఫిక్స్ అన్నారు కూడా.

Advertisement
CJ Advs

బాలయ్య - బోయపాటి సినిమాలో విలన్ పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది అని దానికి శ్రీకాంత్ పర్ఫెక్ట్ అన్నారు. కానీ తాజాగా విలన్ పాత్ర కీలకమే కానీ హీరో శ్రీకాంత్ విలన్ గా చెయ్యడం లేదని.. శ్రీకాంత్ ని అనుకున్న పాత్రలో హీరో రాజశేఖర్ విలనిజాన్ని పండిస్తాడనే న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటికే రాజశేఖర్ బాలయ్య సినిమాలో విలన్ పాత్ర చెయ్యడానికి రెడీ అని చెప్పడం.. హీరోగా రాజశేఖర్ కెరీర్ ప్రమాదంలో ఉండడంతో బోయపాటి బాలయ్య సినిమా కోసం అడగ్గానే రాజశేఖర్ ఈ సినిమాలో విలన్ పాత్ర చెయ్యడానికి ఒప్పుకున్నాడనే టాక్ మొదలైంది. మరి బాలయ్య - బోయపాటి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో కానీ చాలా ప్రశ్నలకు సమాధానాలైతే దొరుకుతాయనిపిస్తుంది.

Balayya, Boyapati Movie Villain Changed:

Rajasekhar Villain Role in Balayya and Boyapati Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs