దెబ్బకు వెనక్కి తగ్గిన నయన్.. ఆల్ ఫ్రీ!


సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి నటన పరంగా ప్రత్యేకించి మరి చెప్పనక్కర్లేదు. ‘నాకు నేనే పోటీ.. నాకు నేనే సాటి’ అన్నట్టుగా నటించేస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నటించమంటే జీవించేస్తుందంతే. అందుకే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు మొదట ఈ బ్యూటీనే సంప్రదిస్తుంటారు. ఇంతవరకూ ఓకేగానీ.. కథ ఒప్పించి సినిమా స్టార్ట్ చేసినప్పుడు నయన్ అంటే నిర్మాతలకు చిరాకేస్తోందని.. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి లోనై.. అసంతృప్తితో నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఇందుకు సుధీర్ఘ వివరణ కూడా నిర్మాతలు ఇచ్చుకున్నారట.

ఇంతకు మునుపు ఏం జరిగింది!?

సుమారు 6 కోట్ల రూపాయిలకు పైగానే పుచ్చుకునే నయన్.. ప్రతిరోజూ సుమారు లక్ష రూపాయిలు దాకా నిర్మాతాలతో ఖర్చు చేయిస్తోందట. అదెలాగంటే.. క్యారవాన్, అసిస్టెంట్స్, బౌన్సర్లు, బాడీగార్డ్‌లు, మేక‌ప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, కారు, కారు డ్రైవర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయట. వీటన్నిటితో పాటు.. షూటింగ్ స్పాట్‌కు ప్రియుడు వచ్చినా ఆయన కోసం రూమ్ కూడా సదరు సినిమా నిర్మాతే భరించాలట. ఇలా నయన్ గురించి పలు ఆరోపణలు వచ్చిన విషయం విదితమే.

ఇప్పుడు ఇలా..!

అయితే.. ఈ మధ్య బాగా రియలైజ్ అయిన నయన్ వామ్మో.. నా వల్ల నిర్మాతలు ఇంతలా ఇబ్బందులు పడుతున్నారా..? ఇక మీదట ఇలా చేయకూడదని భావిస్తోందట. అంతేకాదు.. నిర్మాతకు ఇష్టమైతేనే ఖర్చులు పెట్టుకోవాలని లేదంటే తన పారితోషికంలోనే ఖర్చులు చేయాలనుకుని ఓ నిర్ణయానికి వచ్చిందట. అంటే.. ఆల్ ఫ్రీ అన్న మాట. మొత్తానికి చూస్తే.. ఎక్కడ తనకు అవకాశాలు రాకుండా వెళ్లిపోతాయని వెనక్కి తగ్గిందా..? లేకుంటే నిర్మాతల మండలి గట్టిగానే షాకిచ్చిందా..? అనేది క్లారిటీగా తెలియట్లేదు కానీ.. నయన్‌లో మాత్రం మార్పు వచ్చిందన్న మాట. మార్పు మంచిదే.. మరి ఇందులో నిజానిజాలెంతో..!

నయన్‌కు మళ్లీ భూమ్!

మరీ ముఖ్యంగా ఈ వివాదాలన్నీ తుడిచిపెట్టేసేలా ఇటీవలే.. బికినీతో పాటుగా లిప్‌లాక్ సీన్స్‌లో సింపేస్తానని.. అలాంటి పాత్రలున్నా చెప్పేయండి అంటూ పలువురు నిర్మాతలకు పరోక్షంగా కూడా చెప్పేసిందట. అంటే ఒక్కసారి దెబ్బ పడితే గానీ.. నయన్‌లో ఇలాంటి మార్పులు రావన్న మాట. ఈ స్టార్ తీసుకున్న నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా మల్లీ నయన్‌కు భూమ్ వచ్చేసింది.. ఇక యంగ్ హీరోయిన్ల పరిస్థితేంటో..!

News About Lady Superstar Nayanthara:

News About Lady Superstar Nayanthara
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES