Advertisement
Google Ads BL

నేచురల్ స్టార్‌ను మళ్లీ గెలికిన శ్రీరెడ్డి!


వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నటి కమ్ హాట్ శ్రీరెడ్డి.. మరోసారి నేచురల్ స్టార్ నానిని గెలికింది.!. ఇప్పటికే టాలీవుడ్‌లో చాలా మంది స్టార్‌లపై సంచలన ఆరోపణలు.. వివాదాస్సద వ్యాఖ్యలు చేసిన ఈ హాట్ భామకు రోజులో ఎవరో ఒక్కర్ని టార్గెట్ చేస్తే గానీ నిద్రపట్టేలా లేదు. అయితే ఈమె చేసే వ్యాఖ్యల్లో అన్నీ అబద్ధాలే అని కొట్టి పారేయడానికి కూడా లేదు. ఎందుకంటే తనను ఒకప్పుడు అలా వాడేసుకున్నారని చెప్పుకుంటూ ఉంటుంది. వాస్తవానికి నాని-శ్రీరెడ్డికి మధ్య జరిగిన వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లదాకా వెళ్లడంతో ఆ మధ్య వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లయ్యింది.

Advertisement
CJ Advs

అయితే.. హైదరాబాద్‌ను వదిలేశానంతే.. వివాదాలను మాత్రం కాదంటూ శ్రీరెడ్డి మాత్రం తన నోటికి బుద్ధి చెబుతూనే ఉంది. సమయం సందర్భంగా వచ్చినప్పుడల్లా ఆయా నటీనటులను గోకుతూనే ఉంది. ప్రస్తుతం నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్’ మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో విశ్వక్‌సేన్, నేచురల్ స్టార్‌ల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఇదే సరైన టైమ్ అనుకున్నదో లేకుంటే పాత రోజులు ఏమైనా గుర్తొచ్చాయో తెలియట్లేదు కానీ.. శ్రీరెడ్డి రంగంలోకి దిగేసింది. ‘హిట్’ హిట్టా.. ఫట్టా.. అంటూ హడావుడి చేస్తూ శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. అంతటితో ఆగని ఆ హాట్ బ్యూటీ ‘నూని గాడు ఓమ్ భూమ్ ఫట్ అంటగా’ అంటూ మరో పోస్ట్ చేసింది. నిద్రపోతున్న నానిని గెలికి మరీ వివాదాన్ని రాజేస్తోంది. అంతేకాదు ఇంతవరకూ నాని అనే డైరెక్టుగా తిట్టిపోసే ఈ హాట్.. ఇప్పుడు పరోక్షంగా నూనిగాడు అంటూ రచ్చలేపుతోంది.. మరి నేచురల్ స్టార్ పట్టించుకుంటాడో అబ్బే.. ఎందుకులే అని లైట్ తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.

Again Sree Reddy Comments On Natural Star Nani!:

Again Sree Reddy Comments On Natural Star Nani!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs