Advertisement
Google Ads BL

సీక్వెల్ మూవీ.. చైతూ సరసన స్వీటీ!


టైటిల్ చూడగానే చాలా టూ మచ్‌గా అనిపిస్తోంది కదూ.. అవునండోయ్ మీరు వింటున్నది నిజమే. ఇప్పుడంతా సీక్వెల్ సినిమాల ట్రెండే నడుస్తోందిగా.. సీనియర్, జూనియర్ అనే తేడాల్లేకుండా మూవీస్ సాగిపోతున్నాయ్. అందుకే ఎవరు ఎవరి సరసన నటిస్తున్నారన్నది అస్సలు పాయింటే కాదు..!. ఈ క్రమంలోనే అక్కినేని నాగ చైతన్య సీక్వెల్ సినిమాకు సిద్ధవ్వగా.. అందులో స్వీటీని తీసుకోవడానికి చిత్రబృందం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ చైతూ సినిమాల్లో సీక్వెల్ సినిమా రేంజ్ ఏది ఉందబ్బా అనేగా మీ సందేహం.. ఆలస్యమెందుకు.. ఓ లుక్కేయండి మరి అసలు విషయమేంటో మీకే అర్థమవుతుంది.

Advertisement
CJ Advs

ఎనిమిదేళ్ల క్రితం గౌత‌మ్ మీనన్ ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన ‘ఏమాయ చేశావే’ చిత్రం సినీ ప్రియులను మాయ‌లో ప‌డేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వ‌ల్లే నాగ‌చైత‌న్య, స‌మంత కూడా స్టార్‌లుగా ఎదిగి.. తమకంటూ ఓ ఫ్లాట్‌ ఫామ్‌ను చూసుకుని నిలదొక్కుకున్నారు. అప్పుడు మొదలైన వీరి రీల్ ప్రేమ.. రియల్ లవ్‌గా మారి పెళ్లి పీటల దాకా నడిచిందని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాదు.. అంతకు ముందు త‌మిళంలో కూడా ‘విన్నైతాండి వ‌రువాయ‌’గా గౌత‌మ్ మీనన్‌నే తెరకెక్కించి అక్కడ హిట్టయిన తర్వాతే తెలుగులో తీశాడు. అలా ప్రేమకథా చిత్రాలను చక్కని ఫీల్‌తో తెరకెక్కించే గౌతమ్ తన సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నాడట.

‘విన్నైతాండి వరువాయ-1’ లో త్రిష, శింబు నటించగా.. మొదట తమిళ రీమేక్‌లో ఈసారి యోగా బ్యూటీ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనుష్కను తీసుకోవాలని గౌతమ్ అనుకుంటున్నాడట. ఒకవేళ ఆమె ఒప్పుకుంటే తెలుగులో కూడా ఆమెనే తీసుకోవాలని భావిస్తున్నాడట. అంటే నాన్న అక్కినేని నాగ్ రొమాన్స్ చేసిన స్వీటీతో చైతూ కూడా చేస్తాడన్న మాట. ప్రస్తుతం శింబును ఒప్పించే పనిలో గౌతమ్ ఉన్నాడట. ఆయన ఒప్పుకుంటే త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని.. రిలీజ్ చేసేసి చైతూ సినిమా అయ్యేలోపు హైదరాబాద్‌కు వచ్చేసి సీక్వెల్ చేసేయాలని భావిస్తున్నాడట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Sequel Movie.. Sweety Ropes With Chaitu!:

Sequel Movie.. Sweety Ropes With Chaitu!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs