Advertisement
Google Ads BL

నాగ్ అశ్విన్.. కొంచెం అతి అనిపించడంలా..?


ప్రభాస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అది ఎవరూ కాదనలేని సత్యం. కాకపోతే నా కథకు ప్రభాస్ కరెక్ట్ అంటే ఓకే కానీ నేను రాసుకున్న కథకు కేవలం ప్రభాస్ మాత్రమే కరెక్ట్ అనడం కాస్త అతి అనిపిస్తుంది. నాగ్ అశ్విన్ మహానటితో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత ఇంతవరకు మరో సినిమా ప్రకటించకుండా ప్రభాస్ తో తాజాగా సినిమా పాన్ ఇండియా లెవల్లో ప్రకటించడం అందరికి షాకింగ్ న్యూస్ అయ్యింది. ఇక ఈ సినిమాని మూడు భాషల్లో విడుదల చేస్తామంటూ ప్రకటించడమే కాదు భారీ సైన్స్ ఫిక్షన్ కథకు భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Advertisement
CJ Advs

నాగ్ అశ్విన్ పాన్ ఇండియా లెవల్లో న్యాయం చేయగలడా అనే ఆలోచన లేకుండా ప్రభాస్ నాగ్ అశ్విన్ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రం నాగ్ అశ్విన్ మీద నమ్మకమే అంటున్నారు. నాగ్ అశ్విన్ కేవలం కథ చెప్పి ప్రభాస్ ని ఇంప్రెస్ చేసినా స్క్రిప్ట్ వర్క్ మొదలెట్టాలని చెబుతున్నాడు. తన కథకు కేవలం ప్రభాస్ సరిపోతాడని, ప్రభాస్ మాత్రమే మొయ్యగలడని బడ్జెట్ మాత్రమే కాదు, ఆ క్యారెక్టర్ బరువు మోసే హీరోగా నాకు ప్రభాస్ తప్ప ఇండస్ట్రీలో మరే హీరో కనిపించలేదు అంటూ చెబుతున్నాడు నాగ్ అశ్విన్. మరి బడ్జెట్ ముచ్చట్లు, కథా కమామిషు అన్ని తర్వాత రివీల్ చేస్తా అన్నట్లుగా నాగ్ అశ్విన్ మాటలున్నాయి.

Nag Ashwin Talks About Prabhas:

Nag Ashwin Overaction Revealed with His Next Project
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs