Advertisement
Google Ads BL

యంగ్ టైగర్ కూడా అస్సలు తగ్గట్లేదు


నిన్నమొన్నటివరకు ఎన్టీఆర్ కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన స్టార్ హీరో. కానీ నేడు RRR తో పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ అవతరించబోతున్నాడు. రామ్ చరణ్ తో కలిసి బడా మల్టీస్టారర్ లో రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్న ఎన్టీఆర్ రేంజ్ ఇప్పుడు ఇండియా వైడ్ గా పెరిగిపోయింది. ఇప్పటికే వరస హిట్స్ తో ఉన్న ఎన్టీఆర్ RRR తో ఆ క్రేజ్ మరింత పెంచుకున్నాడు. మరోపక్క బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ నెక్స్ట్ కూడా లైన్ లోకొచ్చేసింది. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ పారితోషకం విషయం పెద్దగా హైలెట్ కాలేదు. మహేష్, పవన్ కళ్యాణ్ ల పారితోషకాల విషయంలో జరిగిన ప్రచారంలో ఎన్టీఆర్ ది ఓ వంతు కూడా లేదు.

Advertisement
CJ Advs

కానీ తాజాగా ఎన్టీఆర్ కూడా పారితోషకం పెంచేసాడనే టాక్ వినబడుతుంది. RRR తో లెవెల్ పెరగడంతో ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్ తో చెయ్యబోయే సినిమా కోసం పారితోషకాన్ని డబుల్ చేసాడనే టాక్ మొదలయ్యింది. కళ్యాణ్ రామ్ - హారిక హాసిని వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికిగాను ఎన్టీఆర్ 50 కోట్ల పారితోషకం అందుకోబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు 20 నుండి 25 కోట్ల పారితోషకంతో సరిపెట్టుకున్న ఎన్టీఆర్ RRR తో పెరిగే క్రేజ్ త్రివిక్రమ్ సినిమాకి బాగా యూస్ అవుతుంది గనక ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుంది అనే ఆలోచనతో భారీ పారితోషకం ఎన్టీఆర్ డిమాండ్ చేసాడట. ఇక కళ్యాణ్ రామ్ తో పాటుగా హారిక వారు కూడా ఎన్టీఆర్ అడిగినదాన్ని కాదనకుండా ఇవ్వడానికి సిద్దమవుతున్నారట. కారణం క్రేజీ స్టార్, పాన్ ఇండియా లెవెల్లో సినిమాకి బిజినెస్ జరుగుతుంది. సో ఇచ్చినా పర్లేదు అనుకుంటున్నారట.

Gossips about Young Tiger Jr ntr Remuneration:

Jr NTR Remuneration Hiked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs