నయనతార నిన్నటివరకు కోలీవుడ్ లో లీడింగ్ హీరోయిన్. అధిక పారితోషకం తీసుకున్న లేడి సూపర్ స్టార్. తాజాగా అమ్మడు నటించిన సినిమాలన్నీ వరసగా ప్లాప్ అవడంతో ఇప్పుడు నయనతార కాస్త లైన్ లోకొచ్చింది అనే టాక్ వినబడుతుంది. నిన్నటివరకు క్రేజీ హీరోయిన్ గా దర్శకనిర్మాతలు చుట్టూ తిప్పుకున్న నయనతారకి నేడు అవకాశాలు సన్నగిల్లేసరికి.. తానే నిర్మాతలకు టెంప్టింగ్ ఆఫర్స్ ఇస్తుందట. పారితోషకంలో తగ్గింపు అలాగే నిన్నటివరకు పద్దతిగా కొంచెం గ్లామర్ గా కనబడిన నయనతార నేడు బికినీ షోకి అందాల ప్రదర్శనకు ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట.
చిరు సై రా దెబ్బ, రజిని దర్బార్ దెబ్బ గట్టిగా తగలడం నయనతారకి లభించిన అపజయాలతో, నయన్ డిమాండ్లతో బాధపడుతున్న నిర్మాతలు ఆమెను ఆఫర్లతో సంప్రదించడం మానేశారు. అందుకే లైన్ లోకొచ్చిన నయనతార స్టయిల్ మార్చి చిన్న నిర్మాతలకు అందుబాటులోకి వచ్చేసిందట. ఇప్పటికే ఓ చిన్న నిర్మాత నయనతార పారితోషకం తగ్గించింది అని బహిరంగంగానే చెప్పాడు. మరోపక్క ప్రమోషన్లకు హాజరుకావడం దగ్గర నుండి శృంగారభరితమైన, హగ్గింగ్ అండ్ లిప్-లాక్ సన్నివేశాల్లో పాల్గొనడానికి, ఆకర్షణీయమైన గ్లామర్ చూపించడానికి సిద్దమే అంటూ.. నయన్ నిర్మాతలకు చెబుతుందట. పరిస్థితి ఆమె చేతిలోనుండి జారిపోతోందని గ్రహించిన నయన్ ఇలా పరిస్థితులకు తలవంచుతుందని అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.