Advertisement
Google Ads BL

‘అన్నపూర్ణమ్మగారి మనవడు’లో రవితేజ హైలెటంట!


‘అన్నపూర్ణమ్మగారి మనవడు’తో అదరగొడతానంటున్న మాస్టర్‌ రవితేజ.

Advertisement
CJ Advs

చిన్న‌త‌నంలోనే వెండి తెరపై కనిపించి, ముద్దుముద్దు మాటలతో బాల నటులుగా మురిపించిన వాళ్లు ఇప్పుడు సినీప‌రిశ్ర‌మ‌లో స్టార్ హీరోలుగా తమదైన శైలిలో రాణిస్తున్నారు. వారిలో ముఖ్యంగా క‌మ‌ల్ హాస‌న్‌, మ‌హేశ్ బాబు, ఎన్టీఆర్‌, త‌రుణ్‌, మంచు మ‌నోజ్‌, ఆకాశ్ పూరి, త‌నీష్‌, బాలాదిత్య, మెగా సుప్రీమ్ తదితరులు బాల‌ నటులుగా చిత్రసీమలోకి అడుగుపెట్టి కెరీర్‌లో ముందుకు సాగిపోయారు. అలాంటి కోవ‌లోనే ఇప్పుడు యం.ఎన్‌.ఆర్‌ చౌదరి కుమారుడు మాస్టర్‌ రవితేజ చేర‌బోతున్నాడు అని అంటోంది చిత్ర యూనిట్‌. 

సీనియర్ న‌టి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలో, జమున కీలక పాత్రలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. ఈ చిత్రంలో మాస్టర్‌ రవితేజ టైటిల్‌ రోల్‌ పోషించారు. నర్రా శివనాగేశ్వర్‌ రావు (శివనాగు) దర్శకత్వంలో యం.ఎన్‌.ఆర్‌ ఫిలిమ్స్‌ పతాకంపై యం.ఎన్‌.ఆర్‌ చౌదరి నిర్మించారు. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని క్లీన్‌ యు సర్టిఫికెట్ పొందిన  ఈ చిత్రం మార్చి 20న విడుద‌ల‌కు సిద్దం అవుతుంది. 

రవితేజ పుట్టుకతోనే నటన నేర్చుకొని వచ్చాడ‌ని, ఎలాంటి శిక్ష‌ణ తీసుకోకుండానే సీనియ‌ర్ న‌టులు అన్నపూర్ణమ్మ, జమున గారి ప్ర‌క్క‌న  టైటిల్‌ రోల్ లో న‌టించి మా టీమ్ అంద‌రిని ఆశ్చ‌ర్యం క‌లిగించాడ‌ని, ఎలాంటి స‌న్నివేశాన్ని అయినా సింగిల్ టేక్‌లో చేసేవాడ‌ని చిత్ర యూనిట్ చెప్తోంది. భ‌విష్య‌త్తులో న‌టుడిగా మంచి స్థాయికి త‌ప్ప‌కుండా ఎదుగుతాడ‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తోంది. అలాగే జమీందారినిగా అన్నపూర్ణమ్మ, ఆమె మనవడిగా మాస్టర్‌ రవితేజ పాత్రలు  సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయ‌ని. వీటితో పాటు అలనాటి కథానాయిక జమున పాత్ర చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంద‌ని, అమృత, ప్రణయ్‌ ఘటన స్ఫూర్తితో బాలాదిత్య, అర్చనపై తెరకెక్కించిన ప్రేమకథ ఆకట్టుకుంటుంద‌ని తెలియ‌జేసింది చిత్ర యూనిట్‌.

Raviteja Highlight in Annapurnamma Gari Manavadu:

<span>Annapurnamma Gari Manavadu Ready to Release</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs