Advertisement
Google Ads BL

రాజమౌళి తలచుకుంటే పెద్ద విషయమే కాదు


RRR అప్ డేట్ కోసం చరణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. అవి ఎంతగా ఉన్నాయి అంటే రాజమౌళి సినిమాలో ఏ ఒక్క సీన్ కానీ, ఏ ఒక్క పిక్ గాని దొరికిందా ఇక అంతే. సోషల్ మీడియాలో వైరల్ చేసి రాజమౌళికి నిద్ర లేని రాత్రులను ఇస్తున్నారు. సినిమా మొదలు పెట్టిన తర్వాత ఒకే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలగలిపిన ఓ ఫస్ట్ లుక్ ని మాత్రమే విడుదల చేసిన రాజమౌళి.. తమ హీరో సింగిల్ లుక్స్ ఎప్పుడు విడుదల చేస్తారంటూ రాజమౌళి మీద ఒత్తిడి తెస్తున్నారు. ఓ అభిమాని అయితే ఏకంగా RRR నిర్మాణ సంస్థను టాగ్ చేస్తూ... RRR ఫస్ట్ లుక్ ఇస్తారా.. ఇవ్వరా.. అంటూ బెదిరింపులకు కూడా దిగాడు అంటే.. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతలా అల్లూరి లుక్ కోసం, కొమరం భీం లుక్ కోసం ఎదురు చూస్తున్నారో తెలుస్తుంది.

Advertisement
CJ Advs

అయితే ఆ అభిమానికి RRR నిర్మాత రిప్లై ఇచ్చాడు. RRR అప్ డేట్ మార్చి అంటూ ట్వీట్ చెయ్యడంతో ఇప్పుడు మార్చిలో RRR అప్ డేట్ ఏమై ఉంటుందా అంటూ అభిమానులు ఆరా మొదలయ్యింది. ఆయితే మార్చి 27 న రామ్ చరణ్ బర్త్ డే కాబట్టి.. ఆ రోజు అల్లూరి సీతారామరాజు పాత్రధారి రామ్ చరణ్ లుక్ రివీల్ కావడం పక్కా అంటూ మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూపులు మొదలయ్యాయి. మరి రామ్ చరణ్ పుట్టిన రోజు కాబట్టి ఆయన లుక్ వదులుతున్నారు. మరి మరో రెండు నెలలు ఎన్టీఆర్ బర్త్ డే కోసం ఆగాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చాలా కష్టం. మే చివరిలో రాబోయే ఎన్టీఆర్ బర్త్ డే రోజున కొమరం భీం లుక్ బయటికొస్తుంది. అప్పటివరకు మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని చూస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కుళ్ళుకోవాలేమో. ఏదైనా ఇద్దరి స్టార్ హీరోల అభిమానులను మెప్పించాలంటే రాజమౌళికి కష్టమే. అలా అని కష్టము కాదు.. రాజమౌళి తలచుకుంటే అది పెద్ద విషయం కాదు.

Ram Charan Look From RRR.. Release Details:

Jr ntr Fans vs Ram Charan Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs