Advertisement
Google Ads BL

ఇప్పుడు వార్ అనసూయ, రోజాల మధ్య!!


జబర్దస్త్ నుండి ఎంతమంది వెళ్లినా.. అనసూయ మాత్రం జబర్దస్త్ ని వదలడం లేదు. మరోపక్క రాజకీయాలతో బిజీ అయినా రోజా జబర్దస్త్ ని వీడడం లేదు. యాంకర్ గా అనసూయ, జడ్జ్ గా రోజాలు తమ చైర్స్ ని ఇప్పట్లో వదలరు. అయితే జబర్దస్త్ స్టేజ్ మీద అనసూయని, రోజా ఎన్ని పంచ్ లు వేసిన సరదాగా తీసుకునే అనసూయకి, రోజాకి మధ్య గొడవేమిటో అనుకుంటున్నారా.. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటుగా అనేక ఛానల్స్ లో అనసూయ దున్నేస్తుంది. స్టేజ్ ఏదైనా పెరఫార్మెన్సు, గ్లామర్ ఒకటే అన్నట్టుగా అనసూయ చెలరేగిపోతూ...  జీ ఛానల్ లో లోకల్ గ్యాంగ్స్ లో ఇరగదీస్తోంది. మరోపక్క జెమిని టీవీ కోసం ఇంకో ప్రత్యేకమైన షో కోసం రెడీ అవుతుంది.

Advertisement
CJ Advs

మరోపక్క రోజమ్మ జబర్దస్త్ తో పాటుగా జీ ఛానల్ లో బతుకు జట్కా బండితో పాటుగా జెమిని టీవీలో మరో ప్రోగ్రాం చేయబోతుంది. అనసూయ హాట్ హాట్ గా తల్లా పెళ్ళామా అనే షో ని చెయ్యబోతుంటే.. రోజా కూడా జెమిని టీవీలో అనసూయకి పోటీ అన్నట్టుగా అమ్మ సరిలేరు నీకెవ్వరు అనే కొత్త ప్రోగ్రాం చేయబోతుంది. అమ్మల గొప్పతనం.. పిల్లలతో అమ్మలు చేసే అల్లరి ఈ షోలో హైలైట్ చేయబోతున్నారు. మెయిన్ గా ఈ షోలో మోడ్రన్ అమ్మలు కనిపిస్తారు. అనసూయ షోలో ఒక అబ్బాయి తల్లి, పెళ్ళాం మధ్యలో ఎలా నలిగిపోతున్నాడు. అలాగే తల్లి, భార్య మధ్యలో జరిగే గొడవలు, ఫన్నీ ఇన్సిడెంట్స్ ని అనసూయ తన షోలో చూపించబోతుంది. మరి అనసూయ, రోజాల ప్రోగ్రామ్స్ జెమినీలోనే ప్రసారమవుతున్నాయి కాబట్టి.. అనసూయ vs రోజా.. ఇలా ఎవరి ప్రోగ్రాంకి ఎక్కువ టీఆర్పీ వస్తుందో చూడాలి.

War Between Anasuya and Roja:

Roja and Anasuya New Shows for Gemini 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs