Advertisement
Google Ads BL

మహేష్ - వంశి ప్రాజెక్ట్ ఆగడానికి కారణం..!


మహేష్ బాబు - వంశి పైడిపల్లి సినిమా మరికొద్ది రోజుల్లో పట్టాలెక్కుతోంది అన్న టైంలో మహేష్ - వంశి సినిమా ఆగిపోయింది అనే న్యూస్ బయలుదేరింది. అటు వంశి పైడిపల్లి కానీ, ఇటు మహేష్ కానీ బయటపడడం లేదు కానీ వంశి విషయంలో జరగాల్సిన  డ్యామేజ్ జరిగిపోయింది. మహేష్ వంశీని నమ్మించి మోసం చేశాడంటూ వంశీ సన్నిహితులు బహిరంగంగానే అంటుంటే వంశీ స్క్రిప్ట్ లో దమ్ములేదని అలాంటి కథతో సినిమా చేస్తే మహేష్ ఇమేజ్ దెబ్బతింటుంది కాబట్టే మహేష్ ఆ ప్రాజెక్ట్ వదులుకున్నాడనే టాక్ నడుస్తుంది. ఈ మధ్యలో వంశీ - మహేష్ వలన దిల్ రాజు నలిగిపోతున్నాడన్నారు. కారణం దొరక్క దొరక్క దిల్ రాజు మహేష్ కి సోలో నిర్మాతగా మారడంతో ఇప్పుడు ఈ సినిమా రద్దవడంతో దిల్ రాజు తల పట్టుకున్నాడేమో అని అనుకుంటున్నారు.

Advertisement
CJ Advs

కానీ తాజా సమాచారం ప్రకారం మన దగ్గర బేరాలేవమ్మ అంటూ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు దిల్ రాజు దగ్గర మహేష్ వాడడంతోనే దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని అందుకే మహేష్ కూడా సినిమా ఆపేసాడనే టాక్ ఫిలింనగర్ లో వినబడుతుంది. మహేష్ సరిలేరు నీకెవ్వరు అప్పుడు సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులతో పాటుగా లాభాల్లో 25 శాతం వాటా కావాలన్నాడని దానికి సరిపడా సరిలేరుకి 45 కోట్లు మహేష్ పారితోషకం అందుకున్నాడనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు దిల్ రాజు సరిలేరు నీకెవ్వరుకు చెల్లించినంత పారితోషకం చెల్లించలేనని చెప్పాడట. కానీ మహేష్ మాత్రం రూపాయి తగ్గేది లేదు అనడంతో దిల్ రాజు చేసేదేం లేక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందంటున్నారు. మహేష్ అడిగింది ఇస్తే చివరికి నష్టాలూ తప్ప లాభాలేం ఉండడం లేదని దిల్ రాజు గ్రహించి మహేష్ తో బేరసారాలకు దిగాడని దానితో మహేష్ ఈ ప్రాజెక్ట్ రద్దు చేసాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. 

Mahesh Vamsi Project Stopped.. This is The Reason:

What is The Reason For Mahesh Vamsi Project Stop
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs