Advertisement
Google Ads BL

అదిరింది.. ఆ యాంకర్‌ని తీసేశారు!


జబర్దస్త్ కి పోటీగా జీ తెలుగు ఛానల్ లో నాగబాబు జడ్జ్ గా అదిరింది ప్రోగ్రాంని స్టార్ట్ చేసారు. జబర్దస్త్ ఓల్డ్ కంటెస్టెంట్స్ తో జబర్దస్త్ అందిరింది స్కిట్స్ చేస్తూ ఏదో అదిరింది షోని అలా అలా నెట్టుకొస్తున్నారు. అయితే జబర్దస్త్ లో యాంకర్ అనసూయ మాదిరిగా అదిరింది షోకి అదిరిపోయే యాంకర్ దొరకలేదు అదిరింది టీంకి. ఒకప్పుడు సీరియల్స్ లో నటించి పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ అదిరింది యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చింది బుల్లితెర సమీరా. సమీరాకి తెలుగు సరిగ్గా రాదు. అలా అని అందాన్ని గ్లామర్ గాను చూపించలేదు. ఏదో స్కిట్స్ లో కమేడియన్స్ వేసే పంచ్ లకు పడి పడి నవ్వడం తప్ప యాంకర్ సమీరా అదిరింది షోకి అసలు హెల్ప్ అవ్వలేదు. అనసూయ లాంటి అందం లేదు, ఆకర్షణ లేదు, అనుభవం లేదు. అయినా అలా అలా నెడుతున్న అదిరింది షోకి పంచ్ మీద పంచ్ లు ప్రేక్షకుల నుండి పడుతున్నాయి.

Advertisement
CJ Advs

ఇక జబర్దస్త్ స్కిట్స్ ని కాపీ పేస్ట్ చేస్తున్నట్టుగా అదిరింది స్కిట్స్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో వేణు, చంద్ర, ధనరాజ్, ఆర్పీ ఏదో లాగించేస్తున్నారు. అయితే తాజాగా అదిరింది యాంకర్ సమీరా పాలస్ లో మేల్ యాంకర్ రవి, బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ వచ్చారు. సమీరా ప్లేస్ లోకి రవి, భానుశ్రీ రావడం చూసి చాలామంది అబ్బ అంటూ ఊపిరి పీల్చుకున్నారు. సమీరాని చూసి చూసి బోర్ కొట్టిన వారికీ రవి, భానుశ్రీలు కాస్త కొత్తగా కనబడుతున్నారు. భానుశ్రీ ఇప్పటికే పలు షోస్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక హాట్ హాట్ డ్రస్సులతో భానుశ్రీ స్టేజ్ మీద సందడి చేస్తుంది. యాంకర్ రవి ఎప్పటిలాగే తనదైన స్టయిల్లో అదిరింది స్టేజికి కొత్తదనం తీసుకొస్తారనిపిస్తుంది. మరి సమీరా ప్లేస్ లో రవి, భానుని చూసి మంచి పని చేసారు. కొత్తవాళ్ళని యంకరేజ్ చెయ్యండి అంటూ జీ ఛానల్ కి అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారంటే సమీరా యాంకరింగ్ లో ఎంత బోర్ ఫీలవుతున్నారో తెలుస్తుంది.

Adirindi Show Ancor Changed:

Two Anchor for Adirindi Program
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs