Advertisement
Google Ads BL

కేజీఎఫ్ 2 లో ఆ నటుడు మిస్సింగ్..?


బాహుబలి స్ఫూర్తితో ఎన్నో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కాయి. అయితే వాటన్నింట్లో ఏవీ కూడా బాహుబలి దరిదాపుల్లోకి చేరలేకపోయాయి. కానీ ఒకానొక్క సినిమా మాత్రం బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అసలేవరూ ఊహించని రీతిలో కలెక్షన్లని రాబట్టింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన ఆ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈపాటికే నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో అర్థమై ఉంటుంది. అవును కేజీఎఫ్ గురించే..

Advertisement
CJ Advs

 

2018 లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తన సత్తా చూపించింది. బంగారు గనుల మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాహుబలి అంతలా కాకపోయినా తన ప్రభావాన్ని బాగానే చూపించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి రెండవ అధ్యాయం తెరకెక్కుతోంది. మొదటి అధ్యాయంలో సినిమా కథని తన మాటల ద్వారా నడిపించిన నటుడు అనంతనాగ్ కేజీఎఫ్ 2 లో నటించడం లేదట. 

 

రాకీ సామ్రాజ్యం ఎలా విస్తరించిందనేది తన గంభీర స్వరంతో వివరించే ఈ నటుడు కేజీఎఫ్ 2 లో కనిపించబోవడం లేదట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, అనంత్ నాగ్ కి మధ్య ఏదో తేడా వచ్చిందని..అందువల్లే వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగి అనంత్ నాగ్ సినిమాల్లో నటించట్లేదని సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతానికి అనంత్ నాగ్ నటించడం లేదని తెలుస్తుంది. మరి ఈ విషయమై చిత్ర బృందం స్పందిస్తే గానీ అసలు నిజాలు బయటకి రావు.

Anant Nag missing in KGF 2..?:

The senior actor Ananth Nag is not going to act in KGF 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs