Advertisement
Google Ads BL

చిరు మూవీలో మహేశ్‌కు హీరోయిన్ ఎవరంటే..!


మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించబోతున్నారని.. గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయ్.. అయితే ఈ ఇరువురూ ఒకే స్టేజ్‌పైన కనిపిస్తేనే మెగాభిమానులు, ఘట్టమనేని అభిమానులు పూనకాలొచ్చేశాయ్.. అలాంటిది ఇక ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ఇక ఇరువురి ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే దాదాపు ఈ కాంబో కన్ఫామ్ అయిపోయినట్లే. అంతేకాదు.. మహేశ్ ఫలానా పాత్రలో నటించనున్నాడని కూడా వార్తలు గుప్పుమంటున్నాయ్.

Advertisement
CJ Advs

స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్న సూపర్ స్టార్ సరసన పూజా హెగ్డే నటిస్తోందని ఇంట్రెస్టిండ్ అప్డేట్ వెలుగుచూసింది. ఇద్దరూ స్టూడెంట్స్‌గా కాలేజీలో పరిచయం అవుతారట. మహేశ్ ధర్నాలు, రాస్తారోకోల్లో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారట. అయితే పూజా మాత్రం ఆయనకు గట్టి సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపిస్తుందట. మహేశ్‌ సరసన ఎవర్ని తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తుండగా సూపర్ స్టారే పూజాను రెఫర్ చేశాడట. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఈ భామ ఓ వెలుగు వెలుతుండటం ఓ కారణమైతే.. ఆల్రెడీ మహేశ్ సరసన నటించింది కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని కొరటాల భావించారట.

అయితే మహేశ్ నటిస్తున్నాడా..? లేదా అనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు కానీ అప్పుడే ఆయన సరసన హీరోయిన్ కూడా వచ్చేసింది..? రెమ్యునరేషన్ వివరాలు..? కాల్ షీట్స్ కూడా ఇచ్చేశాడనే పుకార్లు మాత్రం గుప్పుమంటున్నాయ్. ఇందులో నిజానిజాలెంతో అసలు మహేశ్ అయినా నటిస్తున్నాడో లేదో..? అనేది తెలియాలంటే అటు కొరటాల కానీ.. ఇటు మహేశ్ కానీ.. అనౌన్స్ చేసే వరకు వేచి చూడక తప్పదు. అయితే ఇదే వార్త నిజమైతే మాత్రం మెగాభిమానులు, ఘట్టమనేని ఫ్యాన్స్‌కు పూనకాలు మాత్రం పక్కా!

Mahesh In Chiru Movie.. Heroine Details..!:

Pooja Hegde For mahesh in Chiru 152
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs