Advertisement
Google Ads BL

పవన్‌కు ఉన్న గట్స్ చిరుకు లేవు!


టైటిల్ చూడగానే ఆశ్చర్యపోతున్నారేమో.. ఈ మాటలు అన్నది ఎవరో కాదండోయ్.. ఎంతోమందికి లైఫ్ ఇచ్చి.. తనకంటూ ఇప్పుడు లైఫ్ లేకపోగా యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూలిచ్చి కాలం గడిపేస్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్. ఒకప్పుడు తనేంటో.. తన పనేంటో చేసుకునిపోయే ఈయన ఇప్పుడు శ్రీరెడ్డి, కత్తి మహేశ్, రామ్ గోపాల్ వర్మను మించిపోయాడు. నోరు తెరిస్తే చాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం నెట్టింట్లో, టాలీవుడ్‌లో వివాదాస్పదం అవ్వడమే పనిగా పెట్టుకున్న ఈయన తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి తన మనసులోని మాటను బయటపెట్టాడు. అంతేకాదు ఆ మాటలకు సుధీర్ఘ వివరణ కూడా ఇచ్చుకున్నాడు.

Advertisement
CJ Advs

అసలేమన్నాడంటే..!

‘నేను ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతాను గనుక వివాదాస్పద కొరియోగ్రాఫర్‌గా నాకు ముద్రవేశారు. నేను ఇండస్ట్రీలోకి రావడానికి కారణం దివంగత ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి వల్లే. వాళ్లిద్దర్నీ చూసే నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. నేను కూడా చాలా మందికి లైఫ్ ఇచ్చాను కానీ.. ఇప్పుడు నాకే లైఫ్ లేకుండా పోయింది. చిరు అంటే అందరితో పాటు నాకు నచ్చుతాడు కానీ ఆయన వ్యక్తిత్వం నచ్చదు. నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చిరంజీవి పిలిచి అవకాశాలు ఇచ్చి సాయం చేయొచ్చు.. కానీ ఆయన అలా చేయలేదు అందుకే ఆయనంటే నాకు నచ్చదు. ఎవరేం అనుకున్నా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థానం చిరంజీవిదే. పవన్ వ్యక్తిత్వం అంటే అన్ని విధాలా నాకు నచ్చుతుంది. అతను అస్సలు ఎవరికీ అదరడు.. బెదరడు అందుకే నాకిష్టం.. కానీ పవన్‌కు ఉన్న ఇలాంటి గట్స్ మెగాస్టార్ చిరంజీవికి లేవు’ అని రాకేశ్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన మెగాభిమానులు రాకేశ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Rakesh Master On Chiranjeevi and Pawan kalyan!:

Rakesh Master Sensational Comments on Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs