టాలీవుడ్‌లో వివాదాస్పద వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అంటే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ కంటే ముందుగా ‘కత్తి మహేశ్’ పేరు ఉంటుందన్నది జగమెరిగిన సత్యమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఒక వివాదం లేనిదో నిద్రరాదు.. అది హైలైట్ అయ్యేంతవరకూ పట్టువదలకుండా హడావుడి చేస్తుంటాడు. ఇప్పటికే ఈయన కథేంటో మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు, సినీ ప్రియులు చాలా దగ్గర్నుంచి చూశారు. అయితే అప్పుడెప్పుడో మెగా ఫ్యామిలీని కెలికాం కదా..? మళ్లీ కెలగకపోతే తనను మెగాభిమానులు ఎక్కడ మరిచిపోతారో అనుకున్నాడేమో తాజా షాకింగ్ కామెంట్స్ చేశాడు.
వివాదాస్పద నటి శ్రీరెడ్డి యూ ట్యూబ్ చానెల్ రన్ చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా కత్తిని తాజాగా ఇంటర్వ్యూ చేసిందీమే. ఇద్దరు వివాదాస్పద వ్యక్తులు కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. వీరిద్దరికీ కూడా మెగా ఫ్యామిలీ అంటే అస్సలు పడదు. అలాంటిది మెగా ఫ్యామిలీ హీరోలు మొదలుకుని పవన్‌ను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. అంతేకాదు.. మెగా హీరోల ఫేస్ షేపింగ్స్‌పై కూడా కత్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. శ్రీరెడ్డి వేసిన ప్రశ్నలకు కత్తి ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి.
షాకింగ్ కామెంట్స్!
‘మెగా ఫ్యామిలీలో 9 మంది హీరోలు ఉన్నారు. మన దురదృష్టం ఏంటంటే వాళ్ల ముఖాలు బాలేకపోయినా, మూతి బాలేకపోయినా అభిమానించే పిచ్చోళ్లు తయారయ్యారు. చాలా సినిమాలకు మార్నింగ్ షో తరువాత ఫ్యాన్స్ కూడా థియేటర్‌లో లేని సినిమాలు వాళ్లవి చాలా ఉన్నాయి. అసలు పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడిగా కాకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే.. ఎవరు పట్టించుకునేవారు?. 12 ఫెయిల్ అయినవాడికి ఇంట్లో బాయ్‌గా కూడా ఉద్యోగం ఇవ్వరు.. కానీ పవన్ ప్రమాదవశాత్తు హిట్ అయ్యాడు.. ఎందుకు హిట్ అయ్యాడో అతనికే తెలియదు. నిజానికి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినోడు చిరు.. కానీ పవన్‌కు అసలు ఏమి తెలియదు’ అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశాడు. ఇదంతా ప్రోమోలో మాత్రమే ఉంది.. ఫుల్ వీడియో వస్తే వీరిద్దరికీ మెగాభిమానులు, జనసేన కార్యకర్తల నుంచి ఎలాంటి వాయింపుడు ఉంటుందో ఏంటో మరి.