టాలీవుడ్ హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి విషయమై గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని వెబ్ సైట్లయితే రాజుగారి కుమార్తె ఒప్పుకోవడమే ఆలస్యమని.. ఆమె ఒప్పుకుంటే పెళ్లయిపోయినట్లేనని రాయగా.. ఇంకొన్ని వెబ్ సైట్లు ఇంకో అడుగు ముందుకేసి మూడో కంటికి తెలియకుండా అత్యంత సన్నిహితుల మధ్య షాద్ నగర్‌లో రాజుగారి పెళ్లయిపోయిందని వార్తలు రాసేశాయి. ఇలా చెప్పుకుంటే రకరకాలు.. చిత్ర విచిత్రాలుగా వార్తలు వచ్చేశాయి. ఈ వార్తలపై ఇప్పటికీ స్పందించకపోతే యమా డేంజర్ బాబోయ్.. అంటూ ఎట్టకేలకు రాజుగారు క్లారిటీ ఇచ్చేశారు.
రాజుగారి వివరణ ఇదీ!
‘నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ జాతీయ పత్రిక మొదలుపెట్టింది. అది పుకారు అని తెలిసి కూడా సదరు పత్రిక హడావుడి చేసింది. నేను ఇంకా రెండో పెళ్లి చేసుకోలేదు. చేసుకోవాలనే ఉద్దేశం కూడా ప్రస్తుతం లేదు. ఒక వేళ చేసుకునే ఉద్దేశ్యం ఉన్నా.. చేసుకోవాల్సి వచ్చినా కచ్చితంగా అందరికీ చెబుతాను. మరీ ముఖ్యంగా మీడియాను తప్పకుండా ఆహ్వానిస్తాను. మీ అందిరి సమక్షంలో పెళ్లి చేసుకుంటాను’ అని క్లారిటీ ఇచ్చేశాడు. మొత్తానికి చూస్తే రాజుగారు క్లారిటీ ఇచ్చేశారు గనుక ఇకనైనా రెండోపెళ్లిపై వార్తలు ఆగుతాయో లేదో వేచి చూడాలి మరి.