Advertisement
Google Ads BL

ఈ డైరెక్టర్ అయినా మహేశ్‌ను మెప్పిస్తాడా!?


‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఇదే ఊపులో మరో హిట్ కొట్టాలని తహతహలాడుతున్నాడు. అయితే సరైన కథ దొరకపోవడం.. కథ సిద్ధంగా చేసుకున్న రెడీగా ఉన్న తనకు హిట్టిచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి కథ నచ్చకోవడంతో ఎవరికేం చెప్పాలో..? సూపర్‌స్టార్‌కు అర్థం కావట్లేదట. ఇలా కన్ఫూజన్‌లో ఉన్న సమయంలో సరిగ్గా దీన్నే అదనుగా చూసుకున్న ఓ హిట్ డైరెక్టర్.. నేచురల్ స్టార్ నానికి పలు సూపర్ డూపర్ హిట్లిచ్చిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి రంగంలోకి దిగారట. 

Advertisement
CJ Advs

వాస్తవానికి మహేశ్ కోసం వంశీ పైడిపల్లితో పాటు పరుశురామ్, ప్రవీణ్ సత్తారు పోటాపోటీగా ఉన్నారు. ‘నేనంటే.. నేను’ అన్నట్లుగా మహేశ్ కోసం పోటీ పడుతున్నారు. అయితే ఈ క్రమంలో తన దగ్గరున్న కథ వర్కవుట్ అయితే ముందుగా తనకే అవకాశం ఇచ్చినా ఇచ్చేస్తారేమో అని ఇంద్రగంటికి గట్టి నమ్మకంగా ఉందట. ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్న ఆయన.. మార్చి ఒకటి లేదా రెండు తారీఖుల్లో మహేశ్‌ను కలవాలని ముహూర్తం నిర్ణయించారట. 

విభిన్నమైన కథాకథనాలను తెరపై కొత్తగా ఆవిష్కరించడంలో మోహనకృష్ణ సిద్ధహస్తుడన్న విషయం తెలిసిందే. ఇందుకు ఆయన తెరకెక్కించిన సినిమాలే నిదర్శనం. అయితే డిఫరెంట్‌గా స్టోరీ ఉంటే మాత్రం మహేశ్‌కు నచ్చుతుందని.. కచ్చితంగా తన దగ్గరున్న కథతో ప్రిన్స్‌కు ఒప్పించేస్తాననే ధీమాతో ఆయన ఉన్నారట. మరి ఇది ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి. కాగా.. నాని, సుధీర్ ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘వి’. ఈ సినిమా వచ్చే నెల 25న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తన తదుపరి హీరో కోసం వెతుకుతుండగా మహేశ్‌తో చేయాలని తట్టగా ఆ దిశగా ఇంద్రగంటి అడుగులేస్తున్నారట. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

Will These Director Satisfy Mahesh Babu!:

Will These Director Satisfy Mahesh Babu!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs