Advertisement
Google Ads BL

ఈ హీరోయిన్ ని వదలని రాకేష్ మాస్టర్


టాలీవుడ్ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ నోరు తెరిచాడంటే ఎవరి బండారాలు బయటపడతాయో అంటూ అందరు హడలి చావాల్సిందే. రాకేష్ మాస్టర్ గతంలో శేఖర్ మాస్టర్ తన శిష్యుడు అని కానీ అతనికి గర్వమెక్కువ అని చెప్పాడు. అలాగే ఇంకా చాలామందిపై రాకేష్ స్వయంగా సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ ఓ హీరోయిన్ పై సంచలన నిజాలను బయట పెట్టాడు. అదేమిటంటే ప్రస్తుతం హీరోయిన్ ఛాన్సెస్ లేక పూరి జగన్నాధ్ తో కలిసి పూరి కనెక్ట్స్ అంటూ సినిమాలు నిర్మించుకున్న హీరోయిన్ ఛార్మి గురించి రాకేష్ మాస్టర్ షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

Advertisement
CJ Advs

ఒక సినిమా ఈవెంట్ లో తనకి తెలిసిన అమ్మాయే కదా అని ఛార్మి తన పక్కనుండి వెళుతుంటే.. తనని పలకరించి ఎలా ఉన్నావమ్మా అంటే.. నన్ను పైకి కిందకి చూసి ఎవరు నువ్వు అన్నట్టుగా అక్కడ నుండి వెళ్ళిపోయింది అని.. అసలు ఛార్మి కృష్ణవంశీతో చక్రం సినిమా అప్పుడే తెలుసనీ.. అప్పట్లో ఛార్మి తన దగ్గర డాన్స్ నేర్చుకుంది అని కానీ.. నేను ఇప్పుడు ఇలా గ్లామర్ లెస్ గా కనబడేసరికి ఆమె నన్ను చూసీచూడనట్టుగా ఉండిపోయింది అని.. నేను మేకప్ వేసుకుంటే అందంగానే కనబడేవాడిని అని... అయినా సెలబ్రిటీస్ అంటే పెద్ద గొప్పేం కాదని చెప్పిన రాకేష్ మాస్టర్.. ప్రభాస్ మాత్రం తనని పలకరించి ఎలా ఉన్నారని అడిగాడని చెప్పాడు. చక్రం సినిమా అప్పుడు ప్రభాస్ తో నేను వర్క్ చెయ్యడంతో ప్రభాస్ నన్ను గుర్తుపట్టాడని.. లేదంటే అంటూ నవ్వేసాడు. 

Rakesh Master Talks About Tollywood Heroine:

Dance Master Rakesh Revealed About Charmi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs