Advertisement
Google Ads BL

రాశీ ఖన్నా సర్దేసుకుంటుందా..?


సినీ ప్రపంచంలో ఎంత టాలెంట్ ఉన్నా ఇక్కడ నిలబడాలంటే కేవలం టాలెంట్ మాత్రమే సరిపోదు. అదృష్టం కూడా కావాలి. ఎంత టాలెంత్ ఉన్నా గానీ కొంచెం అదృష్టం ఉండి చేసిన సినిమాలు హిట్ అవుతూ వెళ్తే ఇక వారిని ఆపేవారే ఉండరు. ఈ అదృష్టం అనేది హీరోయిన్లకి ఇంకాస్త ఎక్కువ ఉండాలి. ఎందుకంటే కమర్షియల్ సినిమాల్లో వాళ్ళు కనిపించేదే తక్కువ శాతం. ఆ తక్కువ శాతంలో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్న పని.

Advertisement
CJ Advs

 

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుకి పరిచయమైన భామ రాశీ ఖన్నా.. ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఆమెకు అవకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి. ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలేవీ లేవని టాక్. ప్రతిరోజూ పండగే, వెంకీమామా చిత్రాలు బాగానే ఆడినా..ముందుగానే చెప్పినట్టు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లు పెద్దగా చేసేదేమీ ఉండకపోవడం వల్ల ఆ విజయాలు ఆమెకి కలిసిరాలేకపోయాయి.

 

అదీ గాక ఇటీవల వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఇక తెలుగులో సినిమాలు రావని ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు. అందుకే తమిళంలో ఆఫర్ల కోసం చూస్తుందట. ప్రస్తుతం ఆమెకి తమిళంలో మంచి ఆఫర్లే దక్కుతున్నాయని టాక్.  తాజాగా ఈమెకు తమిళంలో అర్మణి మూడవ పార్ట్ లో నటించే ఛాన్స్ వచ్చింది. అంతే గాక ఇంకా రెండు మూడు సినిమాలు లైన్లో ఉన్నాయట. సో రాశీ ఇక పూర్తిగా అక్కడికే షిఫ్ట్ అయిపోనుందని అంటున్నారు.

Will Rashi khanna leave TFI..?:

Rashi khanna not getting any offers in Telugu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs