Advertisement
Google Ads BL

కాంట్రవర్సీలతో కుదేలవుతున్న నాగశౌర్య


నాగశౌర్య హీరోగా కెరీర్ మొదలుపెట్టి మంచి హిట్స్ అందుకోవడము, అదే టైంలో ప్లాప్స్ కొట్టడము జరిగింది. ప్లాప్స్ లో ఉన్నప్పుడు తల్లి, తండ్రి కలిపి ఐరా క్రియేషన్స్ స్థాపించి ఛలో సినిమాని తెరకెక్కిస్తే అది హిట్ అయ్యింది. ఆ సినిమా హిట్ తర్వాత మరోసారి ఆలోచించకుండా నర్తనశాల, అశ్వద్ధామ సినిమాలు చేసి నాగశౌర్య నిర్మాతగానూ, ఇటు హీరోగానూ బాగా లాస్ అయ్యాడు. అయితే శౌర్య అన్ని తెలిసినట్టుగా కథలోనూ, డైరెక్షన్ లోను వేళ్ళు పెట్టి కెలికెయ్యడం వలనే తన సొంత సినిమాలకు ఇలాంటి గతి పట్టింది అనే టాక్ ఫిలింసర్కిల్స్ లో మొదలైంది. అయితే హీరోగా ప్లాప్ కొట్టిన దానికన్నా ఎక్కువగా ఇప్పుడు నాగశౌర్య టాలీవుడ్ లో అనేక కాంట్రవర్సీలకు నెలవుగా మారాడు. అశ్వద్ధామ మీదున్న నమ్మకంతో ఛలో దర్శకుడు వెంకీ కుడుములు విషయంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు.

Advertisement
CJ Advs

కానీ వెంకీ కుడుముల చాలా సౌమ్యంగా శౌర్యకి చిన్నగా కౌంటర్ వేసాడు. ఇక అశ్వద్ధామ హీరోయిన్ విషయంలోనూ నాగశౌర్య చేసిన పనికి అందరూ శౌర్యనే తిడుతున్నారు. హీరోయిన్ విషయంలో శౌర్య అలా ప్రవర్తించడం సరికాదంటున్నారు. మెహ్రీన్ కౌర్ హోటల్ బిల్స్ కట్టకుండా.... తిరిగి మెహ్రీన్ నే మీడియా చేత తిట్టించడమనేది శౌర్య చేసుండకూడదని అంటున్నారు. అదే టైంలో నాగశౌర్య ఫ్యామిలీ ఐరా క్రియేషన్స్ లో చాలామందికి అంటే కెమెరామెన్ కి, మ్యూజిక్ డైరెక్టర్ కి డబ్బులు ఇవ్వకుండా మొహం చాటేశారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఇప్పుడు అన్ని తిరిగి తిరిగి నాగశౌర్య మెడకు చుట్టుకున్నాయి. మరోపక్క శ్రీనివాస్ అవసరాల సినిమా కూడా శౌర్య ఆపేసాడనే న్యూస్ నడుస్తుంది. మరి ఇకముందు నాగశౌర్యతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారనే టాక్ మాత్రం స్ప్రెడ్ అయ్యింది. 

Hero Naga Shourya in Controversy:

Naga Shourya Faces Problems with Controversies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs