Advertisement
Google Ads BL

మాస్ మహారాజ మరో బాణం సిద్ధం చేస్తున్నాడు..


మాస్ మహారాజ రవితేజ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. వీ ఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన డిస్కోరాజా ప్రేక్షకులని మెప్పించలేక డిజాస్టర్ గా నిలిచింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో రవితేజ మార్కెట్ బాగా దెబ్బతింది. అయితే ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సూపర్ కాప్ క్యారెక్టర్ లో క్రాక్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. శ్రుతిహాసన్ రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement
CJ Advs

 

ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల అయి మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. పోలీస్ ఆఫీసరుగా రవితేజ ఈ సారి హిట్ కొడతాడని భావిస్తున్నారు. అయితే క్రాక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టైమ్ లో రవితేజ నుండి మరో సినిమా ప్రకటన వచ్చింది. రాక్షసుడు సినిమా దర్శకుడు రమేష్ వర్మతో సినిమా ఉంటుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కంటే ముందుగానే మరో చిత్రం మొదలవనుందని సమాచారం.

 

హలో గురు ప్రేమతో సినిమాతో విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు త్రినాథరావు నక్కినతో రవితేజ సినిమా ఉంటుందట. పీపుల్స్ మీడియా సంస్థ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా చేస్తుందట. రమేష్ వర్మ కంటే ముందుగానే ఈ సినిమా తెరకెక్కనుందట. హలో గురూ ప్రేమకోసమే సినిమాతో మంచి ప్రేమకథని చూపించిన త్రినాథరావు రవితేజని ఎలా చూపించనున్నాడో. మరి ఈ చిత్రాలతోనైనా రవితేజ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Mass Maharaja coming with new movie:

Mass Maharaja new movie with TRindharao 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs