మొన్నామధ్యన మెహ్రీన్ కౌర్ పై వచ్చిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏదో ఒకటి అరా కొరా సినిమాలు చేసుకుంటున్న మెహ్రీన్ కి అనుకున్న హిట్ లేకపోగా ఇప్పుడు ఆమెని అంతా నిర్మాతల పట్ల దయలేని హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కారణం ఓ సినిమా ప్రమోషన్స్ విషయంలో మెహ్రీన్ ఒకే ఒక్క ప్రెస్ మీట్ కి హాజరవకపోవడంతో కోపమొచ్చిన ఐ నిర్మాత ఆమెపై లేనిపోనివి మీడియాకి ఉప్పందించడమే అని చెబుతుంది. ఇంతకీ మెహ్రీన్ కౌర్ పై అలాంటి న్యూస్ రావడానికి కారణమేమిటో మెహ్రీన్ స్వయంగా ట్వీట్ రూపంలో చెప్పింది. మెహ్రీన్ కౌర్ - నాగ శౌర్య జంటగా నటించిన అశ్వద్ధామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెహ్రీన్ కౌర్ నిర్మాతల నుండి లాండ్రీ బిల్లులు, హోటల్ బిల్లులు కూడా వసూలు చెయ్యడమే కాకుండా తనతో వచ్చిన వారి బిల్లులు కూడా నిర్మాతల నుండే వసూలు చేయించింది అనే న్యూస్ సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ చక్కర్లు కొట్టింది.
అయితే తర్వాత అశ్వద్ధామ సినిమా పోవడంతో మెహ్రీన్ కౌర్ పై ఈ న్యూస్ నిజమనుకున్నారు. కానీ తాజాగా మెహ్రీన్ కౌర్ ఆ న్యూస్ పై కాస్త ఘాటుగానే స్పందించింది. అదేమంటే నేను ఓ సినిమా ప్రమోషన్స్ లో ఒకే ఒక్క ప్రెస్ మీట్ కి హాజరవలేదు. అది కూడా స్కిన్ రషెస్ వలన హాజరవలేకపోయాను. కానీ ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని ఆ సినిమా నిర్మాత నా మీద తప్పుడు ఆరోపణలు చేసాడు. అసలు నా హోటల్ బిల్ కూడా ఆ నిర్మాత కట్టకపోతే నేనే నా సొంత డబ్బుని పే చేశానని, ఒక హీరోయిన్ లాండ్రీ బిల్, భోజనాలు, టిఫిన్స్ బిల్ కూడా మీడియాకి చెప్పి రాయించడం ఏం సంస్కారం అని.. అలాగే మహిళ మీద అన్యాయాల విషయంలో సినిమాలు తియ్యడం కాదు... ముందు మహిళలను గౌరవించడం నేర్చుకోమని అశ్వద్ధామ నిర్మాతలైన నాగ శౌర్య ఫ్యామిలీపై ఇండైరెక్ట్ గా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. మరి సినిమా పోయి బాధపడుతున్న నాగ శౌర్యపై ఇలాంటి న్యూస్ లు అతన్ని ఇబ్బంది పెడతాయనడంలో సందేహం లేదు.