Advertisement
Google Ads BL

నితిన్ సినిమాలో విలన్‌గా ఆ నటి!


ప్రస్తుతం నితిన్ భీష్మ హిట్ తో పిచ్చ ఆనందంలో ఉన్నాడు. మూడు ప్లాప్స్ తర్వాత వచ్చిన హిట్ సినిమాతో నితిన్ ఉత్సాహంగా మరో సినిమాని లైన్ లో పెట్టాడు. ఇప్పటికే వెంకీ అట్లూరితో రంగ్ దే సినిమా చేస్తున్న నితిన్ తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అంధాదున్ రీమేక్ మొదలెట్టాడు. ప్రస్తుతం రెండు సినిమాలతోనూ, పెళ్లి పనులతోనూ బిజీగా ఉన్న నితిన్ కి అల్లు అర్జున్ విష్ బూస్ట్ లాగా పనిచేస్తుంది. అల్లు అర్జున్.. భీష్మ హిట్ ని పెళ్లి పనులతో కలిసి ఎంజాయ్ చెయ్యంటూ నితిన్ ని విష్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా భీష్మ సక్సెస్ అవడంతో నితిన్ కి విషెస్ తెలియజేస్తూ నితిన్ ని కలిసి అభినందించాడు.

Advertisement
CJ Advs

ఇక నితిన్ ఈ రీమేక్ చేయడంపై మీడియాలో పలు రకాల వార్తలొస్తున్నప్పటికీ.. నితిన్ ధైర్యంగా ఆ సినిమాని లాంచ్ చేసాడు. అయితే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన అంధాదున్ సినిమా కథ మొత్తం ఆయుశ్మాన్ ఖురానా మరియు మరో కీలక పాత్ర టబు చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. అంధుడైన ప్రొఫెషనల్ పియానో ప్లేయర్ లా ఆయుశ్మాన్ ఖురానా పాత్రలో ఒదిగిపోయి ఇరగదీసాడు. అలాగే అక్రమ సంబంధం నెరిపే క్రిమినల్ లేడీ పాత్రలో సీనియర్ హీరోయిన్ టబు అద్భుతమైన నటనతో అదరగొట్టింది. మరి నితిన్ ఆయుష్మాన్ పాత్ర చేస్తుంటే ఇప్పుడు టబు పాత్రధారిపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. టబు పాత్రకి టబునే సెట్ అవుతుంది మరొకర్ని ఊహించలేము అంటున్నారు కొందరు. కాదు ఆ పాత్రకి మరో సీనియర్ నటిని తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. మరి టబు కేరెక్టర్ చేసే లేడి గురించి అందరిలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

Senior Actress Plays Villain Role in Nithin Film:

Andhadhun Remake Villain Confirmed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs