మజిలీ సినిమాతో నాగ చైతన్య కాస్త గాడిన పడ్డాడు. అంతకుముందు వరస సినిమాల ప్లాప్స్ తో ఇబ్బంది పడిన నాగ చైతన్య తర్వాత జాగ్రత్తగా సినిమాల ఎంపిక మొదలెట్టాడు. తాజాగా శేఖర్ ఖమ్ములతో లవ్ స్టోరీ చేస్తున్న చైతూ తదుపరి చిత్రం గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో కన్ఫర్మ్ అవడం పూజ జరిగి కొబ్బరికాయ కొట్టడం కూడా జరిగింది. ఇక ఈ సినిమాకి టైటిల్ గా నాగేశ్వరావు అని వాడుకలోకి రావడం లక్కీ హీరోయిన్ రష్మిక చైతుకి జోడి అంటూ ప్రచారం జరగడంతో అక్కినేని అభిమానులు ఫిదా అవుతున్నారు. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తో డైరెక్టర్ చైతూ సినిమా అనగానే హ్యాపీ మూడ్ లో ఉన్నారు.
కానీ తాజాగా మహేష్ పరశురామ్ కి ఫోన్ చెయ్యడం, కథ అడగడంతో ఇప్పుడు అక్కినేని అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మహేష్ తో వంశి పైడిపల్లి సినిమా త్వరలోనే పట్టాలెక్కాల్సి ఉండగా.. మహేష్ పరశురామ్ కి ఫోన్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మహేష్, వంశి పైడిపల్లి సినిమాని రిజెక్ట్ చేసాడని.. కాబట్టే తన కోసం రెడీ అన్న పరశురామ్ తో సినిమా చెయ్యాలని అతనికి ఫోన్ చేసినట్లుగా పరశురామ్ సన్నిహితులు ప్రచారం చెయ్యడంతో.... చైతూ ఇబ్బంది పడుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. అంతా అనుకున్నాక తనని పక్కనబెట్టి మహేష్ తో పరశురామ్ సినిమా అంటే చైతూ ఫీలవుతున్నాడట. పరశురామ్ కి మహేష్ నుండి ఫోన్ వస్తే ఆగడు. ఎప్పటినుండో మహేష్ తో సినిమా కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. అందుకే చైతూని లైట్ తీసుకుని మహేష్ కోసం రెడీ కాబోతున్నట్లుగా టాక్. మరి మహేష్ క్లారిటీ ఇవ్వలేదు వంశి పైడిపల్లి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టకపోయేసరికి చైతులోనే కాదు అందరిలో అనుమానం మొదలైంది.