Advertisement
Google Ads BL

టాప్ యాంకర్‌తో రష్మి గౌతమ్ పెళ్లంట!


టైటిల్ చూడగానే ఇదేంటి.. సుడిగాలి సుధీర్‌ను యాంకర్ రష్మి ప్రేమిస్తోందటగా.. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే వాళ్లిద్దరూ పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతారని ఇప్పటికే పలుమార్లు వార్తలు విన్నాం.. వాళ్లు చేసే చేష్టలు కూడా అలాగే ఉన్నాయ్ కదా.. పానకంలో పుడకలాగా ఈ టాప్ యాంకర్‌ ఎవరు..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును ప్రస్తుతం అటు యూట్యూబ్, ఇటు వెబ్ సైట్లలో పెద్ద ఈ పెళ్లి వ్యవహారం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ టాప్ యాంకర్ ఎవరు..? ఆయన్నే ఎందుకు చేసుకోవాలనుకుంటోంది..? అనే ఆసక్తికర విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Advertisement
CJ Advs

సుడిగాలి సుధీర్.. రష్మి బంధం గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మా మధ్య ఏమీ లేదని అంతా ఉత్తుత్తే అని చెప్పినప్పటికీ.. స్టేజ్‌పై వాళ్లు చేసే కొన్ని కొన్ని చర్యలు అబ్బే అదంతా అబద్ధమే ప్రేమలో మునిగితేలుతున్నారు అనే దానికి నిదర్శనమవుతున్నాయి. అయితే ప్రస్తుతం కెరీర్ మీద ఇద్దరూ దృష్టిపెట్టారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని భావిస్తున్నారని కూడా టాక్ నడిచింది. అయితే తాజాగా వీరిద్దరి మధ్యలో తెలుగులో టాప్ యాంకర్ అయిన ప్రదీప్ మాచిరాజు వచ్చారట. ప్రదీప్‌తో రష్మిక పెళ్లి జరగబోతోందని.. ఇరువురి పెద్దలను ఒప్పించారని కూడా టాక్ నడుస్తోంది.

అంతేకాదు.. ఈ మధ్య సుధీర్ కంటే ప్రదీపే రష్మికతో మంచి కెమిస్ట్రీని పండిస్తున్నాడు. దీంతో ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. ఈ మధ్యే ఇద్దరూ కలిసి ఒడిషాలో గట్టిగానే వ్యవసాయ భూములు కొన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది వేసవిలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. అబ్బే ప్రదీప్‌కు అంత సీన్లేదని.. అదంతా జోక్ అని కొందరు నెటిజన్లు అంటుండగా.. మరికొందరు మాత్రం నిప్పులేనిదే పొగరాదు.. పైగా ఈ హాట్ హాట్ రూమర్స్‌కు స్పందించకపోవడం.. మౌనం అర్ధాంగీకారం అంటూ వార్తలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. మరి ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో ఏంటో..!

Is Reshmi Marriage With Top Anchor in Tollywood!:

Is Reshmi Marriage With Top Anchor in Tollywood!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs