Advertisement
Google Ads BL

విజయ్ దేవరకొండ పని అయిపోయినట్లేనా..!?


టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఒకట్రెండు హిట్‌లు పడటంతో ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్టవ్వడంతో ఆయన్ను మీడియా స్టార్ హీరోను చేసేసింది. ఆ జాబితాలో విజయ్‌కు ఓ సరికొత్త స్థానం కూడా ఇచ్చేసింది. అయితే అదేదో సామెత ఉంది కదా.. ఎగిరెగిరి పడితే.. అన్నట్లుగా ఏ రేంజ్‌లో అయితే దేవరకొండ దూసుకొచ్చాడో.. అంతే రీతిలో అతి తక్కువ సమయంలోనే బోల్తా పడిపోయాడు. అంటే అప్పుడు హీరోగా వెలిగి.. ఇప్పుడు జీరో స్థాయికి దిగబడ్డాడట. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయని సినీ విశ్లేషకులు, క్రిటిక్స్ చెబుతున్నారు. వాళ్లు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

Advertisement
CJ Advs

అట్టర్ ప్లాప్!

వరుస పరాజయాలతో కెరియర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్‌కి ‘వరల్డ్ ఫేమస్ లవర్’పై కోటి ఆశలు పెట్టుకున్నాడట. అయితే సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఆయన ఆశలన్నీ ఆవిరైపోయాయట. నిజంగా ఈ సినిమా ‘అర్జున్ రెడ్డి’ కంటే రెట్టింపు పేరు తెస్తుందని.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు ముద్దు గుమ్మలను రంగంలోకి దింపి.. వరల్డ్ ఫేమస్ అవ్వాలని అనుకున్నాడట. అయితే.. అది వరల్డ్ కాదు కదా.. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యింది. మొదటిరోజే అట్టర్ ఫ్లాప్ టాక్ రావడంతో సినిమా కొన్న బయ్యర్లు సగానికి సగం నష్టాలపాలయ్యారట.

పూరీ పైనే ఆశలు!

ఇప్పటికే వరుస దెబ్బలు తిన్న విజయ్.. తాజా ప్లాప్‌తో మరింత కుంగిపోతున్నాడట. అంతేకాదు.. వామ్మో.. ఇప్పట్లో దేవరకొండతో సినిమా తీయలేం బాబోయ్ అని డైరెక్టర్లు చేతులెత్తేస్తున్నారట. ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వరుస ప్లాపుల్లో ఉన్న రామ్‌ను ‘ఇస్మార్ట్ శంకర్’గా తీర్చి దిద్ది.. మళ్లీ క్రీజులోకి తెచ్చి ఇస్టార్ట్‌గా వదిలాడు. అయితే అలాగే తనను కూడా రామ్‌లాగా పూరీ సెట్ రైట్ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడట. అయితే ఈ ప్లాప్‌ల లోటు పూడ్చుకునేందుకు తనకంటూ వ్యాపారం ఉందిగా.. దాన్ని డెవలప్ చేద్దామని భావిస్తున్నాడట.

కుంగిపోనక్కర్లేదు!

ఇదిలా ఉంటే.. విమర్శకులు, నిపుణులు మాత్రం విజయ్‌ పని ఇంకా అయిపోలేదని ఒక్క ప్లాప్ పడినంత మాత్రాన అంతలా కుంగిపోవాల్సిన అక్కర్లేదని చెబుతున్నారు. మరోవైపు విజయ్ అంటే పడని హీరోల అభిమానులు మాత్రం అబ్బే.. విజయ్ పని అయిపోయిదంతే.. ఇప్పట్లో ఆయన కోలుకునేది లేదు.. హిట్ పడేది లేదని తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ మధ్యే మైత్రీ మూవీ మేకర్స్.. విజయ్‌కు షాకిచ్చిందట. అలాగే ఒకరిద్దరు డైరెక్టర్లు ఆయనతో కలిసి పనిచేయాలని అనుకున్నప్పటికీ.. ఈ టైమ్‌లో విజయ్‌కు దూరంగా ఉండటమే బెస్ట్ అని భావించి వేరే హీరోలను వెతుక్కునే పనిలో ఉన్నారట. మరి పూరీ పైనే ఆశలు పెట్టుకున్న విజయ్‌ను ముంచుతాడో..? మళ్లీ లైన్‌లోకి తెచ్చి నిలబెడతాడో వేచి చూడాల్సిందే.

Sensational News About Vijay Devarakonda!:

Sensational News About Vijay Devarakonda!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs