Advertisement
Google Ads BL

రోజా దెబ్బకు డైలమాలో పడ్డ మెగా బ్రదర్!


‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షోను వదిలేసి వెళ్లిన మెగా బ్రదర్ నాగబాబు ‘అదిరింది’ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆరంభంలో అంతగా టీఆర్పీ రాకపోయే సరికి అబ్బే.. ఇదే స్టార్టింగ్ అంతే.. ముందుంది చూస్కోండి అని మెగా బ్రదర్ అనుకున్నాడు. చివరికి చూస్తే ఈయన పరిస్థితి అల్లకల్లోల్లంగా తయారైంది. అటు తిరిగి జబర్దస్త్‌లోకి తిరిగి వెళ్లలేక.. ఇటు అదరగొట్టలేక పోతున్నాడాయన. మరోవైపు జబర్దస్త్‌ లేడీ జడ్జ్.. షోను సింగిల్ హ్యాండ్‌తో నడిపించేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే నాగబాబు లేకపోవడం వల్లే షో టీఆర్పీ రేటింగ్స్.. యూ ట్యూబ్‌లో కూడా పెద్ద ఎత్తున వ్యూస్ వచ్చేస్తున్నాయ్.. అని కొందరు భావిస్తున్నారట.

Advertisement
CJ Advs

అయితే.. ‘అదిరింది’ ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. ఇంతవరకూ ఆశించినంతగా టీఆర్పీ రేటింగ్స్ రాకపోవడం.. మరో సింగిల్ హ్యాండ్‌తో రోజా షో నడిపించేస్తుండటంతో షో యాజమాన్యం నాగబాబుపై ఒకింత అసంతృప్తితో ఉందట. అదేంటి సార్.. మీకు ట్రిక్స్ అన్నీ తెలుసనీ.. మీరు ఆశించినంత కంటే ఎక్కువగా పారితోషికం ఇచ్చుకున్నాం ఇంకా పరిస్థితి అదుపులోకి రావట్లేదని యాజమాన్యం తమ అసంతృప్తిని వెల్లగక్కిందట. అంతేకాదు.. రోజా సింగిల్ హ్యాండ్‌తో నడిపించేస్తోంది కదా.. మరి మీరేం చేస్తున్నారు..? అని కూడా ప్రశ్నించిందట. అంటే అక్కడ రోజా రాణిస్తుండటంతో ఇక్కడ నాగబాబుకు బాగానే ఎఫెక్ట్ పడిందన్న మాట. దీన్నిబట్టి చూస్తే రోజా దెబ్బకు నాగబాబు డైలామా పడాల్సి వచ్చిందన్న మాట. 

ఈ క్రమంలో వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానెల్స్ పెద్ద ఎత్తున కథనాలు రాసేస్తున్నాయ్. అట్టర్ ప్లాప్ షో ‘అదిరింది’ టాటా చెప్పేసి జబర్దస్‌లో మళ్లీ అడుగుపెట్టాలని నాగబాబు భావిస్తున్నాడని.. అయితే మల్లెమాల మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టిందని టాక్ నడుస్తోంది. ఎందుకంటే నాగబాబు వెళ్తూ వెళ్తూ తిన్నగా పోలేదు కదా.. అందుకే ఆయన్ను తీసుకోవడానికి.. రెమ్యునరేషన్ తక్కువే ఇవ్వండి పర్లేదు అని చెప్పినప్పటికీ అస్సలు ఒప్పుకునే పరిస్థితిలో మల్లెమాల లేదట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యవహారం నెట్టింట్లో బాగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే నాగబాబు తన యూట్యూబ్ చానెల్‌ ద్వారా స్పందించాల్సిందే మరి.

Mega Brother Naga Babu In Diploma.. Effect Of Roja!:

Mega Brother Naga Babu In Diploma.. Effect Of Roja!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs