Advertisement
Google Ads BL

మరోసారి కాజల్-రానా కాంబోలో తేజ!?


టాలీవుడ్‌ స్టార్ హీరోల్లో ఒకరైన దగ్గుబాటి రానా.. స్టార్ హీరోయిన్‌లలో ఒక్కరైన అందాల భామ కాజల్ కాంబోలో మరో సినిమా రానుందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇందుకు కారణం డైరెక్టర్ తేజ రెండు టైటిల్స్‌ను బుక్ చేసుకోవడమే. ‘అలిమేలుమంగ వేంకటరమణ’, ‘రాక్షసరాజు రావణాసురుడు’ టైటిల్స్‌ను ఇటీవలే ఆయన రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా ఎవరితో తీయాలనే విషయాలు మాత్రం అధికారికంగా రాలేదు కానీ.. పుకార్లు మాత్రం గట్టిగానే షికారు చేస్తున్నాయి. 

Advertisement
CJ Advs

వాస్తవానికి చాలా రోజులుగా తేజ కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెక్కిస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయ్.. అనుకున్నట్లుగానే ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే టైటిల్ తెరపైకి కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలో రానా నటిస్తున్నారని.. ఆయన సరసన కాజల్ నటిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదివరకే వీరిద్దరూ కలిసి ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీకి బాగానే వర్కవుట్ అయ్యింది.. ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఈ జోడీనే మరోసారి తీసుకోవాలని ఫిక్సయ్యారట. ఈ కాంబోలో వస్తే మాత్రం మరోసారి అంచనాలు ఆకాశానికెగురుతాయేమో.!

కాగా.. రానా సరసన కాజల్ నటించడం ఇది రెండోసారి అయినా.. తేజ దర్శకత్వంలో నటించడం ఇదేం మొదటి సారి మాత్రం కాదు.. ‘లక్ష్మి కళ్యాణం’, ‘నేనే రాజు నేనే మంత్రి’,  ‘సీత’లో చేసింది. అలా తన అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన కాజల్.. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్న పూజా హెగ్దే, సమంత, రష్మిక మందన్నా కంటే ముందు కాజల్ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. మరి తాజాగా వస్తున్న కాంబో విషయమై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు.

Rana-Kajal Combo Again Repeats Full Details Here..!:

Rana-Kajal Combo Again Repeats Full Details Here..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs