వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విజయ్ దేవరకొండకి భారీ షాకిచ్చింది. ఆ సినిమా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలిపోయేలా కనబడుతుంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా డిజాస్టర్ దెబ్బకి విజయ్ ఎంచుకునే కథల మీద ఇప్పుడు అందరిలో అనుమానం మొదలైంది. విజయ్ దేవరకొండ కథలను నమ్ముతున్నాడా? అర్జున్ రెడ్డి లాంటి కేరెక్టర్ ని నమ్ముతున్నాడో అర్ధం కానీ పరిస్థితి. అర్జున్ రెడ్డిలా ఎన్ని సినిమాలు చేసిన వర్కౌట్ అవ్వవని.. ఇప్పటికే విజయ్ దేవరకొండకి తెలిసుండాలి. అయితే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ - పూరి సినిమాపై ప్రేక్షకుల్లో భయం పట్టుకుంది. పూరి కూడా మాస్ మాస్ అంటూ హీరోలకి మాస్ ఇమేజ్ కోసం కథలు తయారు చేసి సినిమాలు తీసి అట్టర్ ప్లాప్స్ కొట్టాడు.
మళ్ళీ విజయ్ కి ఎలాంటి కథ చెప్పి పడేసాడో.. అంటూ విజయ్ అభిమానులే కాదు పూరి నిర్మాతలంతా టెన్షన్స్ తో భయపడుతున్నారట. మాస్ ఇమేజ్ కోసం పూరి హీరోలను పూర్తిగా మార్చేస్తాడు. హీరోల లుక్స్ పరంగా ఓకే. ఆ కథ వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అనేది పూరి చూడడం లేదంటున్నారు. ఇక బాలీవుడ్ లో కరణ్ జోహార్ అయితే విజయ్ మీద కాస్త కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ మిగతా భాష నిర్మాతలు విజయ్ క్రేజ్ మీద నమ్మకం సడలింది అని అంటున్నారు.
మరోపక్క విజయ్ దేవరకొండ మీద కరణ్ కన్నేసి ఉంచినట్లుగా చెబుతున్నారు. విజయ్ దేవరకొండ దర్శకుల పనిలో వేళ్ళు పెడుతున్నాడని టాక్ ఉంది. అందుకే కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ పక్కనే తిరుగుతూ అన్నీ గమనిస్తున్నాడనే టాక్ మొదలైంది. అంటే ఆ లెక్కన కరణ్ జోహార్ కి కూడా విజయ్ దేవరకొండ మీద అనుమానం మొదలైనట్లే. కానీ ఎక్కడో హోప్ ఉండడంతో విజయ్ ని నమ్ముతున్నాడట. అసలే బాలీవుడ్ లో కరణ్ జోహార్ తెలివితేటలకు పెద్దపెద్ద హీరోలే ఆశ్చర్యపోతారు. అలాంటి కరణ్ కి విజయ్ నచ్చడం మాములు విషయం కాదు. మరి పూరితో విజయ్ ఏం చేస్తాడో చూడాలి.