Advertisement
Google Ads BL

ఈసారి డ్యూయల్ అంటగా.. బన్నీ?


సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా రెండో షెడ్యూల్లో ఉంది. కేరళలో జరిగిన మొదటి షెడ్యూల్లో బన్నీ పాల్గొనలేదు. ఈ రెండో షెడ్యూల్లో అతను సెట్స్ మీదకు వచ్చాడు. ఫిలింనగర్‌లో లేటెస్టుగా వినిపిస్తున్న ప్రచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీ డబుల్ రోల్ చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ సినిమాలో బన్నీని సుకుమార్ రెండు భిన్న పాత్రల్లో చూపిస్తున్నాడనే రూమర్ నడుస్తోంది. ఒక పాత్ర మోడరన్‌గా, క్లాస్‌గా కనిపిస్తే, ఇంకో పాత్ర పెంచిన గడ్డం, పొడవాటి జుట్టుతో కనిపిస్తుందనేది ఆ వదంతుల సారాంశం.

ఇక సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం ప్రకారమైతే బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా నడుస్తుందనీ, అందుకే ‘శేషాచలం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనీ కూడా కొద్ది రోజుల క్రితం ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా కథ ఎర్ర చందనం స్మగ్లింగ్ చుట్టూ నడుస్తుందనీ, అలా స్మగుల్ అయ్యే ఎర్రచందనాన్ని తన లారీలో తీసుకెళ్లే ఒక లారీ డ్రైవర్‌గా బన్నీ కనిపిస్తాడనీ కూడా కథలు పుట్టుకొచ్చాయి. ఈ మూవీలో బన్నీ జోడీగా తొలిసారి రష్మికా మందన్న నటిస్తోంది. ఈ ఏడాది వరుసగా ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలు హిట్టవడంతో రష్మిక మంచి జోరు మీదుంది.

ఇక ‘అల.. వైకుంఠపురములో’ వంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. ఇదివరకు వాళ్ల కలయికలో ‘ఆర్య’, ‘ఆర్య 2’ వచ్చిన విషయం తెలిసిందే. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా 2021 ఆరంభంలో విడుదల కానున్నది.

Allu Arjun Duel Role in Sukumar Film:

Rumour on Allu Arjun and Sukumar Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs