తెలుగునాట సీరియళ్ళంటే ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అత్తా కోడళ్ల మధ్య తగువులు, ఆడవాళ్ళ మధ్య చిచ్చులు, పగ ప్రతీకారాలతో నలిగిపోతూ కనిపించే కుటుంబాలు కనిపిస్తాయి. ఇలా రొటీన్ ఫార్ములాకి భిన్నంగా సీరియల్ లోనూ కామెడీ పండించే ఉద్దేశ్యంతో వచ్చిన అమృతం ప్రేక్షకులని ఎంతలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. వారానికి ఒక అర్థగంట వచ్చే ఈ సీరియల్ కోసం ఎంతగానో వెయిట్ చేసేవారు.
ప్రేక్షకులను బాగా నవ్వించిన ఈ సీరియల్ సడెన్ గా ఆగిపోయింది. కొన్ని రోజుల్ తర్వాత ఈ అమృతం ఎపిసోడ్లని డిజిటల్ లోకి తెచ్చారు. ఆ పాత ఎపిసోడ్లనే యూట్యూబ్ లో చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమృతం స్టార్ట్ అవబోతుంది. గుణ్ణం గంగరాజు తనయుడు సందీప్ గంగరాజు అమృతం 2 పేరుతో ఈ సీరియల్ కి కొనసాగింపుని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. అమృతం సీరియల్ లో అమృతరావుగా శివాజీరాజాతో పాటు నరేష్ కూడా చేసాడు.
కానీ ఎక్కువ కాలం చేసింది మాత్రం హర్షవర్ధనే. అందుకే ఈ అమృతం 2 లో అమృతరావుగా హర్షవర్ధన్నే తీసుకున్నారు. ఇక అప్పాజీగా శివన్నారాయణ గారిని, సర్వంగా వాసు యింటూరి చేస్తున్నాడు. ఇక మొదటి నుండి చివరి వరకు ఆంజనేయులు పాత్ర చేసిన గుండు హనుమంతరావు స్వర్గస్తులు కావడంతో ఆ స్థానంలో ఎల్ బీ శ్రీరామ్ గారు చేస్తున్నారు. ఈ సీరియల్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జీ 5 లో స్ట్రీమింగ్ అవనుంది.