Advertisement
Google Ads BL

‘రాధాకృష్ణ’తో వెండితెరపైకి ల‌క్ష్మీపార్వ‌తి!


రాజకీయాల్లో లేడి డైనమిక్ గా అందరి దృష్టిని ఆకర్షించిన ల‌క్ష్మి పార్వ‌తి గారు మొదటిసారి న‌టిస్తున్న చిత్రం ‘రాధాకృష్ణ’ 

Advertisement
CJ Advs

హరిని ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ దర్శకులు డమరుకం శ్రీనివాస్ రెడ్డి గారి సమర్పణలో నిర్మాతలు పుప్పాల సాగరిక, శ్రీనివాస్ కానురులు కలిసి నిర్మించిన చిత్రం రాధాకృష్ణ. ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వుంది. నంద‌మూరి తార‌క రామారావు గారి స‌తీమ‌ణి, తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్న డైన‌మిక్ లేడి అండ్ లీడ‌ర్ ల‌క్ష్మి పార్వ‌తి గారు మొద‌టిసారిగా ఈ చిత్రంలో కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. అంతే కాకుండా ఏవిధ‌మైన అండ‌దండ‌లు లేకుండా సినిమాపై మ‌క్కువ‌తో సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదిగిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మ‌రో కీల‌కపాత్రలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో వీరితో పాటు అనురాగ్‌, ముస్కాన్ సేతిలు జంటగా న‌టించారు. కనుమరుగు అవుతున్న నిర్మల్ కొయ్య బొమ్మల కథ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ఆప్యాయతలను చూపిస్తూనే పల్లె వాతావరణంలోని అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఒక అందమైన ప్రేమకథను అందరికి నచ్చేలా అంద‌రూ మెచ్చేలాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ప్రసాద్ వర్మ.

అలీ, కృష్ణ భగవాన్, చమ్మక్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవలే దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ఎక్కడా రాజీ పడకుండా అనుకున్న విధంగా చిత్రీకరణ జరిగిన ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను అతి త్వరలో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తామని నిర్మాతలు తెలిపారు.

సాంకేతిక నిపుణులు:

కెమెరామెన్: టి.సురేందర్ రెడ్డి

సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ

కొరియోగ్రాఫర్: స్వర్ణ

ఆర్ట్; సాయి మణి

ఎడిటింగ్: ప్రభు

దర్శకత్వం: ప్రసాద్ వర్మ

Lakshmi Parvathi in Radhakrishna Movie:

Radhakrishna Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs