స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివికమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. సంక్రాంతికి రిలీజైన అన్ని చిత్రాలలో కెల్లా ఎక్కువగా జనాల్ని ఆకర్షించిన చిత్రం అల వైకుంఠపురములో అని చెప్పవచ్చు. అందుకే ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డుని క్రియేట్ చేయగలిగింది. నా పేరు సుర్య నా ఇల్లు ఇండియా తర్వాత అల్లు అర్జున్ సంవత్సరంన్నర వరకి తెర మీద కనిపించకుండా ఒక్కసారిగా తన అభిమానులకి అల వైకుంఠపురములో చిత్రం ద్వారా చాలా రోజులకి సరిపడా విందుని అందించాడు.
ఇటు తెలుగు రాష్ట్రాలతో సహా అటు ఓవర్సీస్ లోనూ ఈ చిత్రం దుమ్ము దులిపింది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలకి ఓవర్సీస్ మంచి గిరాకీ ఉంటుంది. అ ఆ తో ఓవర్సీస్ లో త్రివిక్రమ్ స్టామినా ఏంటో అందరికీ తెలిసిపోయింది. త్రివిక్రమ్ కి ఉన్న మార్కెట్ తో కలిపి అల్లు అర్జున్ ఛరిష్మా కూడా కలవడంతో ఈ సినిమా రేంజ్ మరింతగా పెరిగిపోయింది. సినిమా విడుదలై నలభై ఐదు రోజులవుతున్నా ఇంకా థియేటర్లలో కొనసాగుతుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో..
అయితే ఈ సినిమా ఇప్పుడు థియేటర్ల నుండు ఖాలీ అయ్యే సమయం వచ్చేసింది. యాభై రోజుల పండగ చేసుకోవడానికి దగ్గర అవుతున్న వేళ ఈ సినిమా మరో మారు రిలీజ్ కానుంది. ఎవరైతే సినిమా మిస్ అయ్యారో వారు మళ్లీ చూడచ్చు. అవును.. డిజిటల్ లోకి వచ్చేయనుంది. ఈ నెల 26వ తేదీ నుండి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవనుంది. అయితే డిజిటల్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క చానెల్ అమెజాన్ ప్రైమ్..
ఇక్కడే పొరపడ్డారు. జెమినీటివీ కి చెందిన సన్ నెక్స్ట్ యాప్ లో అల వైకుంఠపురములో చిత్ర ఈ నెల 26 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవనుంది. సినిమా చూడని వాళ్ళు, చూసినా తనివి తీరని వాళ్ళు చూసేసుకోండి.