Advertisement
Google Ads BL

తన తదుపరి 2 చిత్రాలను ప్రకటించిన తేజ!


రెండు కొత్త సినిమాల టైటిళ్లనూ, హీరోలనూ ప్రకటించిన డైరెక్టర్ తేజ

Advertisement
CJ Advs

దర్శకుడు తేజ శనివారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, వాటి హీరోలనూ ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు.

ఈ సినిమాల కోసం ఆయన ‘రాక్షస రాజు రావణాసురుడు’, ‘అలిమేలు మంగ వెంకట రమణ’ అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమంటే, హీరోలు సహా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా ఈ సినిమాల పోస్టర్లను తేజ విడుదల చేశారు. దాంతో రానాతో చేసే మూవీ ఏది? గోపీచంద్ నటించే సినిమా ఏది?.. అనే విషయాన్ని ఆయన ప్రస్తుతానికి సస్పెన్సులో ఉంచారు.

ఈ సినిమాల నిర్మాతలనూ, వాటిలో నటించే తారాగణాన్నీ త్వరలోనే తేజ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాల స్క్రిప్టుల్ని పూర్తి చేశారు. ‘జయం’ చిత్రంతో గోపీచంద్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ, ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో రానాకు మరపురాని హిట్‌ను అందించిన విషయం గమనార్హం.

Director Teja Announces Heroes And Titles Of His Next Two Films:

Director Teja Birthday special: Two Movies Announced
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs