Advertisement
Google Ads BL

శిల్పాశెట్టికి పంచ్ వేసిన కంగనా సోదరి రంగోళి....


ప్రస్తుతం కాలంలో అద్దెగర్భం (సరోగసీ) ద్వారా పిల్లల్ని కనడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ ప్రాసెస్ ని ఉపయోగించి చాలా మంది తమకి పిల్లలు లేని లోటుని తీర్చుకుంటున్నారు. సామాన్య జనాల కన్నా సెలెబ్రిటీలు ఈ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ ఏజ్ లెస్ బ్యూటీ శిల్పాశెట్టి సరోగసీ ద్వారా ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది. శిల్పాశెట్టి, తన భర్త రాజ్ కుంద్రా వాళ్ల కూతురుని చూసుకుంటూ మురిసిపోతున్నారు.

Advertisement
CJ Advs

 

అయితే సరోగసీ ద్వారా బిడ్డని కన్న శిల్పాశెట్టిని ఉద్దేశిస్తూ బాలీవుడ్ క్వీన్ సిస్టర్ అయిన రంగోళి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం కంటే ఎవరినైనా దత్తత తీసుకోవడం మంచిదని సలహా ఇస్తోంది. తాను కూడా రెండో బిడ్డని దత్తత తీసుకున్నట్టు చెప్పుకొచ్చింది. ఇలా చేయడానికి తన సోదరి కంగనా సలహా తీసుకున్నట్లు తెలిపింది.

 

ప్రస్తుతం రంగోళి చేసిన వ్యాఖ్యలు శిల్పా శెట్టినే కాదు మొత్తం సరోగసీ ద్వారా బిడ్డల్ని కన్న వాళ్ళందరినీ ఉద్దేశించి అన్నట్లుగా ఉందని అంటున్నారు. బాలీవుడ్ లో సరోగసీ ద్వారా పిల్లల్ని కన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. షారుక్ ఖాన్ నుండి మొదలుపెడితే ఆమీర్ ఖాన్, కరణ్ జోహార్ మొదలగు వారందరినీ టార్గెట్ చేస్తూ ఈ మాటలని అన్నదని అంటున్నారు. మరి రంగోళి వ్యాఖ్యలకి ఈ తారలు ఎవరైనా బదులు ఇస్తారా లేదా అన్నది చూడాలి.  వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేయడం సరికాదని చాలా మంది భావిస్తున్నారు.

Rangoli comments on Shilpa shetty:

Kangana sister rangoli comments on Rangoli
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs