Advertisement
Google Ads BL

విజయ్ దేవరకొండ దిగొచ్చేశాడా....?


అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన విజయ్ తన మాటలతో, చేష్టలతో యూత్ ఐకాన్ గా మారిపోయి జనాల్లో మంచి ఫాలోయింగ్ ని ఏర్పర్చుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో ఏదైనా సక్సెస్ ఉన్నంత  వరకే అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం విజయ్ కి ఇంకా బాగా తెలుసు.. పెళ్ళి చూపులు సినిమా తర్వాత వరుసగా దాదాపు ఆరేడు సినిమాలు ఒప్పుకున్నాడు. ఆ ఆరేడు సినిమాల్లో ఒక సినిమానే అర్జున్ రెడ్డి కూడా ఒకటి.

Advertisement
CJ Advs

 

అర్జున్ రెడ్డితో విజయ్ రేంజ్ మారిపోయింది. అతని సినిమాల మీద అంచనాలు పెరిగిపోయాయి. దాంతో అతడు ఒప్పుకున్న సినిమాలపై ఆ ఎఫెక్ట్ బాగా పడింది. అతడు ఒప్పుకున్న వాటిలో గీత గోవిందం మినహా మిగతా సినిమాలన్నీ అర్జున్ రెడ్డి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. ప్రస్తుతం అతడు పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం.

 

ప్రతిరోజూ పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు విజయ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడని అంటున్నారు. అయితే విజయ్ కూడా మారుతితో సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడట. స్క్రిప్టు నచ్చితే ఓకే చెప్పేయాలని చూస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లకి కూడా దొరకని విజయ్..ఇప్పుడు మిడ్ రేంజ్ దర్శకులకి కూడా అందుబాటులోకి వస్తున్నాడని..ఇదంతా రెండు ఫ్లాపుల మహిమ అని అంటున్నారు. ఏదైతే ఏముందిలే కానీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని విజయ్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

Maruti trying to do a movie with VIjay:

Maruti writing  script for Vijay Devarakonda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs