మంచు విష్ణు మోసగాళ్ళు చిత్రంలో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ లుక్ విడుదల !!!
ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించారు కాజల్ అగర్వాల్. మంచు విష్ణు నటిస్తోన్న మోసగాళ్ళు సినిమాలో కాజల్ డైనమిక్ పాత్రలో కనిపించనుంది. ఇదివరకు కాజల్ చేసిన పాత్రలకు ఇది భిన్నంగా ఉండబోతోంది.
మోసగాళ్ళు చిత్రం నుండి కాజల్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా ఉండబోతోంది. దేశంలో జరిగిన ఒక పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ చిత్ర కథాంశం ఉండనుంది.
ఇటీవలే లాస్ ఏంజిల్స్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీసిన చిత్ర యూనిట్ సోమవారం నుండి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారు. వయా మార్ ఎంటర్ టైన్ మెంట్ మరియు ఏవిఏ బ్యానర్స్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విరోనిక మంచు నిర్మిస్తున్నారు. జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, రుహాని సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.