Advertisement
Google Ads BL

‘క్రాక్’ సినిమా టీజర్ విడుద‌ల‌


మహా శివరాత్రి  సంద‌ర్భంగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, శృతి హాస‌న్‌, గోపీచంద్ మ‌లినేని, ఠాగూర్ మ‌ధు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ‘క్రాక్’ సినిమా టీజర్ విడుద‌ల‌

Advertisement
CJ Advs

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం  ‘క్రాక్’. డాన్‌శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌ హ్యాట్రిక్ చిత్ర‌మిది.  శివరాత్రి సంద‌ర్భంగా  ‘క్రాక్’ సినిమా టీజర్ విడుద‌ల‌ చేశారు చిత్ర యూనిట్.

ఒంగోల్  లో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే.. అనే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్ ఆద్యంతం ఉత్కఠభరితంగా సాగింది. అప్పిగా, తుప్పిగా, నువ్వు ఎవరైతే నాకేంట్రా డొప్పిగా.. అంటూ తనదైన మ్యానరిజం తో రవితేజ చెప్పే డైలాగ్  సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ - ‘‘మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సమ్మర్ స్పెషల్ గా మే 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. రవితేజ నుండి మీరు ఆశించే అన్ని అంశాలు  ఉంటాయి. టీజర్ లో చూసింది చాలా తక్కువ సినిమాలో ఇంకా చాలా ఉంటుంది. మా యూనిట్ కి మంచి కమర్షియల్ సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. మా డి ఒ పి విష్ణు అధ్బుతమైన విజువల్స్ అందించారు. టీజర్ లాగే మూవీలో కూడా తమన్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాం’’ అన్నారు.

ఈకార్యక్రమంలో నిర్మాత బి. మధు, కో ప్రొడ్యూస‌ర్‌ అమ్మిరాజు, డి ఓ పి జి.కె విష్ణు, నిర్మాత సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా అన్ని ఎలిమెంట్స్‌తో డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

న‌టీన‌టులు:

ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, సుమ‌ద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్ర‌సాద్‌, పూజిత పొన్నాడ‌, చిరాగ్ జాని, మౌర్యాని, హ్యాపీడేస్ సుధాక‌ర్‌, వంశీ చాగంటి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  గోపీచంద్ మ‌లినేని

నిర్మాత‌:  బి.మ‌ధు

బ్యాన‌ర్‌:  స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్‌

సంగీతం:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ:  జి.కె.విష్ణు

డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా

కో ప్రొడ్యూస‌ర్‌:  అమ్మిరాజు కానుమిల్లి

ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలి

ఆర్ట్‌:  ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌

ఫైట్స్‌:  రామ్ ల‌క్ష్మ‌ణ్‌

పాట‌లు:  రామ‌జోగ‌య్య‌శాస్త్రి

మేక‌ప్‌:  శ్రీనివాస‌రాజు

కాస్ట్యూమ్స్‌: శ‌్వేత‌, నీర‌జ కోన‌

స్టిల్స్‌:  సాయి

పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌

ప‌బ్లిసిటీ డిజైన్‌:  వ‌ర్కింగ్ టైటిల్ శివ‌

ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  కోట‌ప‌ల్లి ముర‌ళీకృష్ణ‌

కో డైరెక్ట‌ర్స్‌:  గులాబి శ్రీను, నిమ్మ‌గడ్డ శ్రీకాంత్‌

చీఫ్ కో డైరెక్ట‌ర్‌:  పీవీవీ సోమ‌రాజు

Krack Movie teaser Released:

Krack Movie Teaser Release Event details  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs