ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో మూవీ ఎనౌన్సమెంట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాతో యావరేజ్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ ప్రస్తుతం పిచ్చ క్రేజ్ లో ఉన్నాడు. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో త్రివిక్రమ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోను ఎన్టీఆర్ RRR మూవీతో రచ్చ రంబోలా చెయ్యడానికి సిద్దమయ్యాడు. మరి అలాంటి క్రేజీ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో నటించే హాట్ హీరోయిన్ మీద అప్పుడే ఫిలింసర్కిల్స్ లో రకరకాల పేర్లు తెర మీదకి వచ్చేస్తున్నాయి. మరోపక్క అల వైకుంఠపురములో మూవీకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన థమన్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అని అందరూ ఫిక్స్ అవుతున్నారు.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్ పై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ మధ్యన త్రివిక్రమ్ హీరోల మీద ఎక్కువగా ఫోకస్ చేసి హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటున్నట్టుగా కనబడుతుంది. మొన్నటికి మొన్న అల వైకుంఠపురములో హీరోయిన్ పూజా హెగ్డేని కేవలం ఆమె థైస్ మీదే ఫోకస్ చేసి ఆమె గ్లామర్ ని అడ్డంగా వాడేసాడు. ఇక అరవింద సమేత దగ్గర నుండి త్రివిక్రమ్ కి పూజానే తగులుతుంది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ కోసం హీరోయిన్ ని అమరుస్తుందా? లేదంటే పూజా లక్కీ కదా అదే కంటిన్యూ చేస్తాడా? అనేది తేలాలి. కాకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ సరసన రష్మిక అనే టాక్ ఉంది. ప్రస్తుతం లీడింగ్ లో పూజా, రష్మిక ఉన్నారు. మరి ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ మరో కొత్త భామని ట్రై చేస్తాడా అనేది ఇంకా సస్పెన్స్.