Advertisement
Google Ads BL

ఏంటిది బోయపాటీ.. బాలయ్య అసహనం!?


నంద‌మూరి బాల‌కృష్ణ- బోయపాటి కాంబోలో సినిమాకు కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే. బాలయ్యకు ఇది 106వ సినిమా కావడంతో కాసింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు నటిస్తున్నారు..? అనే విషయం తెలియరాలేదు కానీ.. పుకార్లు మాత్రం బోలెడన్ని వచ్చాయ్. ఇదిగో ఈ బ్యూటీని తీసుకుంటున్నారు.. అదుగో ఆ బాలీవుడ్ భామను తీసుకుంటున్నారు.. అబ్బే తెలుగు హీరోయిన్‌నే తీసుకుంటున్నారు అని ఇలా చాలానే పుకార్లు వచ్చాయి. అయితే.. ఫైనల్‌గా ఈ హీరోయిన్‌ల ఎంపిక బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా దగ్గర వచ్చి ఆగిందని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ అబ్బే అదేం లేదని తేల్చేసింది.

Advertisement
CJ Advs

తాజాగా.. శ్రియను తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే.. తాను ప్రస్తుతం ఖాళీగా లేనని నటించడం కుదరదని శ్రియ షాకిచ్చిందట. దీంతో హీరోయిన్ వెతకడం బోయపాటికి కష్టమైపోయింది. మరోవైపు సీనియర్ హీరోయిన్లు కూడా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి ఇదీ అని బాలయ్యకు వివరించాడట. ఏంటిది బోయపాటీ.. హీరోయిన్స్ లేరా ఏంటి..? కొత్తవాళ్లను తీసుకోవచ్చు కదా.. అని బాలయ్య అసహనానికి లోనయ్యారట. అంతేకాదు.. త్వరగా చూడాలని కాస్త గట్టిగానే బోయపాటికి చెప్పాడట.

మరి బాలయ్య మాట ప్రకారమే కొత్త భామను పట్టుకొస్తాడో..? లేకుంటే పాత హీరోయిన్‌నే సెటిల్ చేసి షూటింగ్ పట్టాలెక్కిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఆలస్యం అంటే బాలయ్యకు అస్సలు పడదన్న సంగతి తెలిసిందే. అలాంటిది కొబ్బరికాయ కొట్టి ఇన్ని రోజులవుతున్నా ఒక్క హీరోయిన్‌ కోసం ఇంత టైమ్ పట్టిందంటే.. షూటింగ్ ఎన్నిరోజులవుతుందో..? ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో..? అదెలా ఉంటుందో ఏంటో.. బాలయ్య-బోయపాటికే తెలియాలి మరి.

Balayya Angry On Boyapati.. Details Here..!:

Balayya Angry On Boyapati.. Details Here..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs