Advertisement
Google Ads BL

‘అల’ కాదు.. ‘రేసుగుర్రం’ సీక్వెల్‌ వస్తోందట!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ సినిమా బన్నీ కెరీర్‌లో ఇదివరకెన్నడూలేనంత క్రేజ్‌ సంపాదించిపెట్టింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని.. బన్నీ నాన్న, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్-త్రివిక్రమ్ మధ్య ఈ విషయమై చర్చకొచ్చిందని అన్నీ అనుకున్నట్లు జరిగితే సుకుమార్‌తో సినిమా అనంతరం ‘అల-2’ తీయాలని కూడా భావించారు. అయితే.. ఏం జరిగిందో ఏమోగానీ త్రివిక్రమ్-అల్లు అరవింద్ మధ్య మనస్పర్థలు రావడంతో అది పక్కనెట్టేశారట. అది మరుగున పడిందని తెలుసుకున్న స్టార్ డైరెక్టర్.. బన్నీకి మంచి హిట్టిచ్చిన సురేందర్ రెడ్డి రంగంలోకి దిగిపోయారట.

Advertisement
CJ Advs

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌‌ అయిన ‘సైరా నరసింహారెడ్డి’ ని తెరకెక్కించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈయన ఇదే ఊపులో మరో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అయితే సరైన హీరో దొరక్క వేచి చూస్తున్నాడట. వాస్తవానికి ఈయన దగ్గర రెండు కథలున్నాయ్.. హీరో మాత్రం దొరకలేదు. దీంతో అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా స్టార్ హీరోతోనే చేయాలని భావించి వేచి చూస్తున్నాడట. అయితే గ్యాప్ చాలా వచ్చేలా ఉందని భావించిన సురేందర్.. తన మిత్రుడు వక్కంతం వంశీతో కూర్చోని ‘రేసుగుర్రం’ సీక్వెల్ చేద్దామని అనుకున్నారట. ఈ మేరకు బన్నీని సంప్రదించగా ‘మీరు ఓకే అంటే నేను సుక్కు సినిమా అవ్వగానే రంగంలోకి దిగేస్తాను’ అని మాటిచ్చాడట.

బన్నీ హామీ ఇవ్వడంతో వీరిద్దరూ స్క్రిప్ట్ రాసే పనిలో నిమగ్నమయ్యారట. ఒకవేళ ఈ లోపు తన దగ్గరున్న కథలకు స్టార్ హీరో దొరికితే అది పూర్తి బాధ్యతలు వక్కంతం వంశీకి అప్పగించాలని సురేందర్ అనుకున్నాడట. గత కొన్ని రోజులుగా మెగా హీరో వరుణ్ తేజ్, ప్రభాస్ ఇలా ఒకరిద్దరు లైన్‌లో ఉన్నారట. గ్యాప్ ఎందుకులే అని ‘రేసుగుర్రం-2’ కథ రాస్తున్నారట. మరి తాజాగా ఇటు సోషల్ మీడియాలో అటు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ హాట్ హాట్ టాపిక్‌పై సురేందర్ లేదా బన్నీ రియాక్ట్ అయితేగానీ క్లారిటీ వచ్చేలా లేదు.

RaceGurram Sequel With Allu Arjun!:

RaceGurram Sequel With Allu Arjun!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs