Advertisement
Google Ads BL

సవాలుగా భావించి సినిమా ఒప్పుకున్నా: సమంత


సమంత జాను సినిమా తరవాత సినిమాలేవీ ఒప్పుకోకుండా ఖాళీగా ఉండిపోయింది. ఇక సమంత సినిమాలు మానేస్తుందా? అనే ప్రశ్న తలెత్తేలోపు తమిళనాట విజయ్ సేతుపతికి జోడిగా నయనతారతో కలిసి సినిమాకి సైన్ చేసి షాకిచ్చింది. ఈ సినిమాలో నయనతార - సమంత నువ్వా నేనా అని గొడవపడుతున్న కాత్తువక్కుల రెందు కాదల్ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ప్రస్తుతం స్కూల్ బిజినెస్ లోకి దిగిన సమంత సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతుంది అనుకున్నప్పుడు.. విజయ్ సేతుపతి లాంటి క్రేజీ స్టార్ సినిమాలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో సమంత సినిమా అనగానే అందరిలో పిచ్చ ఆసక్తి. అందులోని సమంత తాజాగా కథా బలమున్న సినిమాలని ఒప్పుకోవడం, నయనతార మరో హీరోయిన్ కావడంతో ఆ కాత్తువక్కుల రెందు కాదల్ సినిమాపై క్రేజ్ పెరిగిపోయింది.

Advertisement
CJ Advs

అయితే సమంత ఈ సినిమా ఒప్పుకోవడానికి గల కారణం ఏమిటో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెబుతుంది. ఆసక్తికర, విభిన్న, అద్భుతమైన కథల కోసం తాను ఎదురుచూస్తున్న సమయంలో తన వద్దకు ఈ కాత్తువక్కుల రెందు కాదల్ సినిమా ఆఫర్ వచ్చిందని.. అయితే తనకు ఈ సినిమా కథ  బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పానని చెబుతుంది. అంతేకాకుండా నయనతార, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ పక్కన నటించడం ఒక సవాలుగా భావించానని అందుకే మరోమాట లేకుండా ఈ సినిమా ఒప్పుకున్నా అని చెబుతుంది.

Samantha About kaathu vaakula rendu kadhal :

Samantha Takes Challenge for kaathu vaakula rendu kadhal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs