Advertisement
Google Ads BL

‘భీష్మ’పై హెబ్బా పటేల్ అలిగిందా?


‘కుమారి 21 ఎఫ్’‌తో అందరిని అల్లాడించిన హెబ్బా పటేల్ గ్లామర్ పరంగా బికినీ వెయ్యమన్నా వేస్తుంది. అందాలు ఆరబొయ్యడంలో ఎక్కడా తగ్గని హెబ్బా పటేల్‌కి ఏం చేసినా అవకాశాలు రావడం లేదు. నిన్నమొన్నటివరకు హెబ్బా పటేల్ హొయలు సోషల్ మీడియా వరకే పరిమితమయ్యాయి. అలాగే ఆమె ముచ్చట్లు కూడా మీడియాలో వినబడలేదు. కానీ భీష్మ సినిమాలో హెబ్బా పటేల్ నటించడంతో రేపు విడుదల కాబోయే సినిమాలో హెబ్బా పాత్రపై అందరిలో ఆరా మొదలైంది. అయితే సినిమాలో కథను మలుపు తిప్పే ముఖ్యమైన పాత్రలో హెబ్బా నటిస్తుంది అన్నారు. అయితే హెబ్బాకి అవకాశాలు లేకపోయినా టెక్కుకి తక్కువేం లేదంటున్నారు.

Advertisement
CJ Advs

ఎందుకంటే వచ్చిన అవకాశంతో రెచ్చిపోకుండా భీష్మ సినిమా ప్రమోష‌న్స్‌కి ఎగ్గొడుతుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ అలాగే భీష్మ ఇంటర్వూస్ లో కానీ హెబ్బా కనిపించడం లేదు. రష్మిక ముందు తాను తేలిపోతాను అనుకుందో? లేదంటే చిన్న పాత్రకి ప్రమోషన్ అవసరమా అనుకుందో కానీ హెబ్బా మాత్రం భీష్మ పై మట్లాడడం లేదు. కానీ భీష్మ యూనిట్ మాత్రం హెబ్బాకి ఈ సినిమాలో పాత్ర చెప్పి ఆమెని తీసుకున్నప్పుడే ప్రమోషన్స్ లో పాల్గొనాలని చెప్పారట. దానికి అప్పుడు ఒప్పుకున్నా హెబ్బా పటేల్ ఇప్పుడు మాత్రం భీష్మ విషయంలో సైలెంట్ అయ్యింది అంటున్నారు. మరోపక్క హెబ్బా ప్రమోషన్స్‌కి రావకపోవడానికి కారణం ఆమె పాత్ర తాలుకూ కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్‌లో లేపెయ్యడమే అని, అందుకే అలిగి భీష్మ ప్రమోషన్స్‌కి డుమ్మా కొట్టింది అంటున్నారు. 

No Hebah Patel at Bheeshma Promotions :

This is the reason for Hebah Patel Serious on Bheeshma team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs