Advertisement
Google Ads BL

అప్పుడే సీక్వెలా.. అంత నమ్మకమేంటి నితిన్...?


నితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీష్మ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  దీంతో చిత్ర బృందం ప్రమోషన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. రేపు రిలీజ్ అవబోతున్న సినిమాలన్నింటిలో పాజిటివ్ బజ్ తో రిలీజ్ అవబోతున్న చిత్రం భీష్మ ఒక్కటే. ప్రీ రిలీజ్ కి త్రివిక్రమ్ ని తీసుకురావడం లాంటి వాటి వల్ల ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి కలిగించారు.

Advertisement
CJ Advs

 

అయితే ఈ సినిమా గురించి మరో వార్త బయటకొచ్చింది. భీష్మ సినిమాకి సీక్వెల్ రెడీ కాబోతుందట. స్క్రిప్టు పనులు కూడా చకచకా జరుగుతున్నాయట. భీష్మ చిత్రానికి ఎవరైతే పనిచేశారో వారి ఆద్వర్యంలోనే ఈ సీక్వెల్ ఉంటుందట. ఈ సీక్వెల్ ని వచ్చే సంవత్సరం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే సీక్వెల్ గురించి ఆలోచిస్తున్నారంటే ఈ సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది అతి విశ్వాసమా లేదా సరైనదేనా అనేది రేపటితో తెలిసిపోతుంది. అయితే ఇదంతా ఉత్తిదే అని కొందరంటున్నారు. సినిమా ప్రమోషన్ల సమయంలో సీక్వెల్ గురించి తరచుగా మాట్లాడుతుంటారని..అలా అని ఆ వార్తలని నమ్మడానికి వీలు లేదని చెప్తున్నారు. మరి వీటిలో ఏది నిజమో చిత్ర యూనిట్ కే తెలియాలి.

Nithin willing to do a sequel..?:

Bheeshma sequle is coming soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs