Advertisement
Google Ads BL

ఆ మూవీ రైట్స్ చరణ్ తీసుకోలేదంట!


ఈ మధ్యన పర భాష చిత్రాలు హిట్ అయితే చాలు.. ఆ సినిమా హక్కులపైనే టాలీవుడ్ నిర్మాతల కన్ను ఉంటుంది. దిల్ రాజు అయితే ఏకంగా రీమేక్స్‌నే నమ్ముకున్నాడు. అలాగే సురేష్ బాబు కూడా. తాజాగా రామ్‌చరణ్ కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయాడు. గత ఏడాది మలయాళ హిట్ ఫిలిం లూసిఫర్ హక్కులను దక్కించుకున్నాడు. ఆ సినిమా చిరుతోనే ఉంటుంది అని అంటున్నారు. మరోపక్క రామ్ చరణ్ మరో మలయాళ హిట్ ఫిలిం డ్రైవింగ్ లైసెన్స్ సినిమా రీమేక్ రైట్స్ కొన్నట్లుగా ప్రచారం జరగడమే కాదు... ఆ రైట్స్ కూడా హీరో వెంకటేష్ కోసమే అన్నారు.

Advertisement
CJ Advs

కానీ తాజా సమాచారం ప్రకారం రామ్‌చరణ్ ఆ డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ హక్కులను కొనలేదని.. ప్రస్తుతం నిర్మించాలని అనుకుంటే చాలా సినిమాలు లైన్ ఉన్నాయి కానీ.. ఇప్పుడు మళ్లీ మరో మరో రీమేక్ అవసరం లేదని చరణ్ సన్నిహితులకు చెబుతున్నాడట. డ్రైవింగ్ లైసెన్స్ నిజంగా సూపర్ హిట్ ఫిలిం. అందుకే చరణ్ కొన్నాడనగానే సొషల్ మీడియాలో చాలా ఫాస్ట్‌గా ఆ న్యూస్ వైరల్ అయ్యింది. 

ఓ హీరోకి, ఓ లైసెన్స్ అధికారికి మధ్య జరిగిన కథతో దర్శకుడు చాలా ఆసక్తిగా ఈ సినిమాని తెరకెక్కించాడు. ఆ సినిమా చూసిన వాళ్ళెవరూ ఆ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యకుండా మానరు. మరి ఆ రీమేక్ రైట్స్ ఎవరు దక్కించుకుంటారో కానీ.. ప్రచారంలో ఉన్న న్యూస్ లోలా హీరో వెంకటేష్ అయితే ఈ రీమేక్‌కి పర్ఫెక్ట్ అంటున్నారు.

Ram Charan About Driving Licence Rights:

I am not Taken Riving Licence Rights Says Ram Charan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs