విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్‌లతో ఫామ్ కోల్పోతున్నాడు. అయితే పూరి జగన్నాధ్ చిత్రంతో మళ్ళీ క్రేజ్ తిరిగి సంపాదిస్తానని విజయ్ ఖచ్చితంగా చెప్పాడు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్లాప్ టాక్ అనగానే విజయ్ దేవరకొండ మరోమాట లేకుండా పూరి సినిమా కోసం ముంబై ఫ్లైట్ ఎక్కేసాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ సినిమా షూట్ ముంబైలో జరుగుతోంది. లిగర్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణ భాషలలో మరియు హిందీలో తయారవుతోంది. ఇక వరస షాకులతో విజయ్ దేవరకొండ కథల ఎంపిక ఇప్పుడు చాలా క్లిష్టంగా మారింది. పూరి చిత్రం తర్వాత దిల్ రాజు బ్యానర్ లో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందించిన శివ నిర్వాణతో చిత్రానికి సంతకం చేశాడు. ఆ సినిమా ఉంటుందో లేదో క్లారిటీ లేదు కానీ తాజాగా విజయ్ దేవరకొండ తనని స్టార్ హీరో చేసిన అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మరోమారు జతకట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు సందీప్ వంగా నెక్స్ట్ మూవీ రణబీర్ సింగ్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అని బాలీవుడ్ టాక్. ఇక ప్రస్తుతం సౌత్ కి వచ్చేసిన సందీప్ వంగాకి బాలీవుడ్ లో సినిమాలు చెయ్యడానికి బాలీవుడ్ హీరోలంతా ముందస్తు కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటంతో సందీప్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి నెక్స్ట్ ఫిలిం చెయ్యబోతున్నట్టుగా ఓ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
తన కెరీర్‌లో అతిపెద్ద బ్రేక్ ఇచ్చిన సందీప్‌తో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధమే అని చెప్పే విజయ్ దేవరకొండ కూడా సందీప్ కి ఓకే చెప్పాడని అంటున్నారు. సందీప్ కోసం శివ నిర్వాణ చిత్రాన్ని వాయిదా వేయడానికి కూడా విజయ్ సిద్ధంగా ఉన్నాడని సందీప్ వంగాని పాన్ ఇండియా స్క్రిప్ట్ తో కథ తయారు చెయ్యమని విజయ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. పూరి సినిమాని ఎనిమిది నెలల్లో కంప్లీట్ చేసి నీ సినిమా కోసం రెడీ అవుతానని సందీప్ కి విజయ్ మాటిచ్చినట్లుగా తెలుస్తుంది.