ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో ఎవరని అంటే టక్కున గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఇటీవల రిలీజైన వరల్డ్ ఫేమస్ లవర్ నెగెటివ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ దిశగా పయనిస్తుంది. అంతకుముందు డియర్ కామ్రేడ్ రూపంలో పెద్ద డిజాస్టర్ ని వచ్చిన సంగతి తెలిసిందే.. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
అయితే ఆ సినిమా చిత్రీకరణలో ఉండగా విజయ్ తో హీరో అనే సినిమాని కూడా ప్రకటించారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో వినూత్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాని తీర్చిదిద్దాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుత సమాచార ప్రకారం ఈ సినిమా క్యాన్సిల్ అయిందని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ పది కోట్లు ఖర్చు పెట్టిందట.
హీరో లోని కొన్ని సీన్ల కోసం పది కోట్లు ఖర్చుపెట్టారట. కానీ విజయ్ కి వరుస ఫ్లాపులు రావడంతో మైత్రీ సంస్థ ఈ సినిమాని క్యాన్సిల్ చేసుకుని ఉంటుందని అనుకుంటున్నారు. డియర్ కామ్రేడ్ సినిమా ఫలితం నెగెటివ్ రావడంతో విజయ్ మార్కెట్ చాలా దెబ్బ తింది. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ తో మరింతగా దెబ్బ తింది. మరి పది కోట్లు ఖర్చు పెట్టిన సినిమా పూర్తిగా ఆగిపోయినట్టేనా లేక మళ్లీ ముందుకు వెళ్తుందా అనేది చూడాలి.